విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడుతుండటం చూస్తూనే ఉన్నాం. ఆడిన ప్రతి మ్యాచ్ లో విరాట్ నిరాశ పరుస్తూనే ఉన్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఫామ్ లేమిపై టీమిండియా మాజీలు సైతం అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కపిల్ దేవ్, సెహ్వాగ్, నెహ్రాలాంటి విరాట్ కాస్త విశ్రాంతి తీసుకుంటే బావుంటుంది అంటూ సలహా ఇస్తున్నారు. కోహ్లీ ఇప్పటికే వెస్టిండీస్ టూర్ నుంచి విశ్రాంతి కోరిన విషయం తెలిసిందే.
మరోవైపు కోహ్లీకి టీమిండియా, ఫ్యాన్స్ నుంచే కాకుండా విదేశీ క్రికెటర్ల నుంచి కూడా భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. పాక్ కెప్టెన్ బాబర్ అజాం, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ లు బాహాటంగానే తమ మద్దతును ప్రకటించారు. చాలా మంది ట్వీట్ల ద్వారా కోహ్లీకి అండగా నిలుస్తున్నారు. గత కొంత కాలంగా విరాట్ కోహ్లీ ఫామ్ అనేది నేషనల్ ఇష్యూలా మారిపోయింది. దానిపై స్పందనలు, ప్రతి స్పందనలు వస్తూనే ఉన్నాయి.
This too shall pass. Stay strong. #ViratKohli pic.twitter.com/ozr7BFFgXt
— Babar Azam (@babarazam258) July 14, 2022
తన ఫామ్‌పై ఇన్నాళ్లు నోరు విప్పని విరాట్ కోహ్లీ.. తొలిసారి స్పందించాడు. అంటే నేరుగా కాకపోయిన తన మదిలో ఏం అనుకుంటున్నాడు అనేది ఒక ఫొటో రూపంలో తెలియజేశాడు. విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన ఫొటోలో ఏంజల్ విగ్స్ ఉన్నాయి. దానిపై రెండు క్యాప్షన్లు ఉన్నాయి. ఒకటి నేను పడిపోతే? అని ఉంది. రెండో కోట్.. కానీ, డార్లింగ్ నువ్వు ఒకవేళ నువ్వు ఎగిరితే? అనే ప్రశ్న ఉంది.
Here’s what @josbuttler said on @imVkohli.#ENGvsIND #KingKohli pic.twitter.com/EQoGcv8G16
— RevSportz (@RevSportz) July 15, 2022
అంటే కోహ్లీ ఫామ్ పై అంతా ఆందోళన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ ఇంకా అవకాశాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కోహ్లీ ఒకవేళ నేను సక్సెస్ అయితే అనే కోణంలో స్పందించాడు. ఆ ఫొటో పెట్టి చూసే దృష్టికోణం అని చెప్పుకొచ్చాడు. అంటే నేను సక్సెస్ అవుతానా? అవ్వలేనా అనేది మీరు పెట్టుకున్న నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పకనే చెప్పాడు.
𝗙𝗼𝗿𝗺𝘀 𝗰𝗮𝗻 𝗯𝗲 𝘂𝗽 𝗮𝗻𝗱 𝗱𝗼𝘄𝗻 𝗯𝘂𝘁 𝗤𝘂𝗮𝗹𝗶𝘁𝘆 𝗶𝘀 𝗽𝗲𝗿𝗺𝗮𝗻𝗲𝗻𝘁 ✅💖🔥
Rohit Sharma’s 𝗿𝗲𝗮𝗰𝘁𝗶𝗼𝗻 𝗼𝗻 Virat Kohli 𝗶𝗻 𝗽𝗿𝗲𝘀𝘀 𝗰𝗼𝗻𝗳𝗲𝗿𝗲𝗻𝗰𝗲 𝗬𝗲𝘀𝘁𝗲𝗿𝗱𝗮𝘆 🙌❤️✨
#KingKohli #ViratKohli #ViratKohli𓃵 #RohitSharma #Virat #INDvsENG pic.twitter.com/wmUVlCpOSp— Reja Hossain (@RejaHossain999) July 11, 2022
ఇప్పుడు కోహ్లీ షేర్ చేసిన ఈ పిక్ వైరల్ గా మారింది. కోహ్లీ ఫ్యాన్స్ అంతా అతని రెస్పాండ్ అవ్వడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వస్తాడంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే విమర్శలకు త్వరలోనే సెంచరీతో సమాధానం చెబుతాడంటూ కామెంట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ చెప్పకనే చెప్పిన తన రెస్పాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Perspective pic.twitter.com/yrNZ9NVePf
— Virat Kohli (@imVkohli) July 16, 2022