విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో.. ఆదివారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డే చూస్తే అర్థం అవుతుంది. వన్డే క్రికెట్‌ను ఎలా ఆడాలో కోహ్లీ బ్యాటింగ్ చూసి నేర్చుకోవచ్చు. ఎప్పుడు గేర్ మార్చాలో.. పెద్ద ఇన్నింగ్స్‌లు ఎలా ఆడాలో.. టెక్ట్స్‌బుక్‌లో రాసినట్లు ఆడి చూపించాడు. జూలువిదిల్చిన సింహంలా.. లంక బౌలర్లను విరుచుకుపడుతూ.. చరిత్ర సృష్టించే ఇన్నింగ్స్ ఆడాడు. వ్యక్తిగతంగా రికార్డుల మోత మోగించిన కోహ్లీ.. తనతో పాటు టీమిండియా చరిత్ర సృష్టించేలా చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా శ్రీలంకపై 317 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
కోహ్లీ విధ్వంసానికి తోడు గిల్ సెంచరీ, సిరాజ్ సూపర్ బౌలింగ్‌తో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ వణికించాడు. లంక ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లు పూర్తి అయ్యేసరికి.. సిరాజ్ తన 10 ఓవర్ల కోటా పూర్తి చేసి.. 32 పరుగులిచ్చి 4 వికెట్ల పడగొట్టాడు. అందులో ఒక ఓవర్ మెయిడెన్ ఉంది. సిరాజ్‌తో పాటు షమీ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయడంతో లంక 73 పరుగులకే ఆలౌట్ అయింది. బండార గాయంతో బ్యాటింగ్‌కు రాకపోవడంతో లంక 9 వికెట్లకే ఆలౌట్‌గా అంపైర్లు ప్రకటించారు. దీంతో టీమిండియా వన్డే క్రికెట్‌లో 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. చరిత్ర లిఖించింది.
విరాట్ విశ్వరూపం.. రికార్డుల మోత!
ఈ మ్యాచ్‌లో కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 8 సిక్సులతో 166 పరుగులు బాదాడు కోహ్లీ. ఇది అతని కెరీర్‌లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్. గతంలో పాక్‌పై 183 కొట్టాడు. అలాగే.. ఈ ఇన్నింగ్స్‌తో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. వన్డే క్రికెట్ స్వదేశంలో సచిన్ 20 సెంచరీలు బాదగా.. కోహ్లీ 21 సెంచరీలు నమోదు చేసి.. రికార్డు సృష్టించాడు. కోహ్లీకి వన్డేల్లో ఇది 46వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 74వ సెంచరీ. ఈ రికార్డుతో పాటు ఒక జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. శ్రీలంకపై 10వ సెంచరీ నమోదు చేయడం ద్వారా కోహ్లీ ఈ రికార్డు సాధించాడు. అలాగే ఆదివారం మ్యాచ్ జరిగిన తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ మైదానంలో కోహ్లీ చేసిన 166 పరుగులే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్. తన వన్డే కెరీర్‌లో ఒ ఇన్నింగ్స్‌లో విరాట్ 8 సిక్సులు బాదడం ఇదే తొలి సారి.
ఇక వన్డే క్రికెట్ చరిత్రలో 150 కంటే ఎక్కువ పరుగులు చేసి అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన ప్లేయర్ కూడా కోహ్లీనే. కోహ్లీ ఏకంగా 4 సార్లు 150 కంటే ఎక్కువ పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్రపంచంలో మరే క్రికెటర్‌కు ఈ రికార్డు లేదు. వీటితో పాటు మరో అరుదైన రికార్డును కోహ్లీ సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. లంకపై ఆడిన ఇన్నింగ్స్‌తో ఆ దేశానికే చెందిన దిగ్గజ క్రికెటర్ మహేలా జయవర్దనే రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు జయవర్దనే 12,650 రన్స్‌తో ఐదో స్థానంలో ఉండగా.. విరాట్ నిన్నటి ఇన్నింగ్స్‌తో 12,754 రన్స్‌తో జయవర్దనేను వెనక్కి నెట్టి ఐదో స్థానం ఆక్రమించాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. త్వరలోనే నాలుగో స్థానానికి చేరే అవకాశం ఉంది.
రికార్డులు..
India produced a record-breaking win in the third #INDvSL ODI 🙌
Details ➡️ https://t.co/ZMU2ILrNuP pic.twitter.com/xD3vmMBrZF
— ICC (@ICC) January 16, 2023
Virat Kohli went past Sachin Tendulkar’s tally of tons at home during his unbeaten 166 in the #INDvSL ODI in Thiruvananthapuram on Sunday 👀
India also broke a world record during their crushing win over Sri Lanka 👉 https://t.co/js8L3oeJVS pic.twitter.com/Epvh1Esb4V
— ICC (@ICC) January 15, 2023