టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 72వ సెంచరీని బాదేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగగా.. అతను ఉన్నంత సేపు యాంకర్ రోల్ ప్లే చేసిన కోహ్లీ.. ఇషాన్ అవుటైన తర్వాత సిక్స్‌తో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ 2022తో తన పూర్వపు ఫామ్ అందుకున్న కోహ్లీ.. అప్పటి నుంచి దుమ్ములేపుతున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లోనూ అద్భుతంగా ఆడిన కోహ్లీ.. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ.. బంగ్లాదేశ్‌పై సెంచరీతో కదం తొక్కాడు. ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ పలు భారీ భారీ రికార్డులను బద్దలు కొట్టాడు. 85 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సుతో 103 పరుగులు చేశాడు. 97 పరుగుల వద్ద ఉన్న సమయంలో ఫైన్ లెగ్ మీదుగా భారీ సిక్స్‌తో కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోవడం విషయం.
భారీ రికార్డులు బద్దలు..
ఈ సెంచరీతో కోహ్లీ కొన్ని భారీ రికార్డులను బద్దలు కొట్టాడు. 72వ సెంచరీతో ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సెంచరీ బాదిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 100 సెంచరీలతో దిగ్గజ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా.. 72 సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలోకి వచ్చాడు. ఇప్పటి వరకు 71 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను వెనక్కినెట్టిన కోహ్లీ.. రెండో స్థానాన్ని అధిరోహించాడు. అలాగే.. ఈ ఇన్నింగ్స్‌లో 16 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ మరో రెండు అరుదైన రికార్డులను బద్దలు కొట్టాడు. బంగ్లాదేశ్‌పై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా, అలాగే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో పాటు బంగ్లాదేశ్‌లోనూ కోహ్లీ వన్డేల్లో వెయ్యి పరుగులు బాదాడు. మూడు దేశాలపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో ఆటగాడిగా కోహ్లీ ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పాటు శ్రీలంక మాజీ దిగ్గజాలు డిసిల్వా, అర్జున రణతుంగా సరసన చేరాడు. ఇక అత్యధిక దేశాల్లో 1000 రన్స్ చేసిన ఏకైక ఆటగాడిగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ ఏకంగా ఐదు దేశాల్లో వెయ్యికి పైగా పరుగులు చేశాడు.
అయితే.. 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 113 పరుగులు చేసిన కోహ్లీ.. షకీబ్ అల్ హసన్ వేసిన ఇన్నింగ్స్ 42వ ఓవర్ తొలి బంతికి మెహిదీ మిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 305 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ వికెట్ పడిన తర్వాత.. వెంటవెంటనే శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ అవుట్ అవ్వడంతో.. టీమిండియా పరుగుల ప్రభావానికి అడ్డుకట్టపడింది. ప్రస్తుతం 44 ఓవర్లు ముగిసే సరికి.. 359 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నారు. చివరి 6 ఓవర్ల పాటు వీరద్దరూ ఆడితే.. టీమిండియా 400 పరుగుల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
Virat Kohli is only behind the great Sachin Tendulkar. pic.twitter.com/2hpFuJzoVK
— CricTracker (@Cricketracker) December 10, 2022