శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. కేవలం 87 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 113 పరుగులు సాధించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఇచ్చిన అద్భుతమైన స్టార్ట్‌తో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోహ్లీ సెంచరీకి తోడు.. రోహిత్ శర్మ 83, శుబ్‌మన్ గిల్ 70 పరుగులు చేయడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. లంక ముందు 374 పరుగుల కొండంత లక్ష్యం వచ్చిపడింది.
ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో ఎక్స్‌ట్రా కవర్స్ దిశలో అద్భుతమైన షాట్ ఆడాడు. కానీ.. దాన్ని ఒక సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ అద్భుతమైన డైవ్‌తో బౌండరీ వెళ్లకుండా కాపాడాడు. దీంతో తన బౌండరీ ఆపాడనే కోపం చూపించకుండా.. అతని ఫీల్డింగ్‌ను మెచ్చుకున్నాడు కోహ్లీ. ఈ ఘటన ఇన్నింగ్స్ 41వ ఓవర్ సమయంలో చోటు చేసుకుంది. రజిథా వేసిన ఆ ఓవర్ తొలి బంతిని విరాట్ కోహ్లీ ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా బౌండరీకి తరలించే ప్రయత్నం చేశాడు.
కానీ.. సబ్‌స్టిట్యూడ్‌గా వచ్చిన అషేన్ బండార బౌండరీ లైన్ దగ్గర చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి.. అద్భుతమైన డైవ్‌తో బాల్ బౌండరీ వెళ్లకుండా ఆపాడు. దీంతో 4 పరుగులు రావాల్సిన చోట రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. తనకు రన్స్ రాకుండా అడ్డుకున్నా.. ఫీల్డింగ్ బాగుండటంతో కోహ్లీ సైతం.. బండారను మెచ్చుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ఫీల్డర్‌ను కోహ్లీ ఎంత నిస్వార్థంగా అభినందిస్తున్నాడో చూస్తే.. కోహ్లీ ఎంత గొప్ప వ్యక్తో అర్థం అవుతుందని అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli appreciating fielding effort Bandara – This is great to see. pic.twitter.com/UPSpwIYbZH
— CricketMAN2 (@ImTanujSingh) January 10, 2023