ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న విరుష్క దంపతులు.. ఎంతో సాధారణంగా మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మతో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గల మహాకాశ్వేర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలో పాల్గొన విరుష్క జంట.. ఎంతో భక్తి శ్రద్ధలతో శివపూజ చేశారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు కోసం ఇండోర్‌లో ఉన్న కోహ్లీ.. మూడో టెస్టు మూడు రోజుల్లో ముగిసిపోవడంతో.. దొరికి ఖాళీ సమయాన్ని భార్యతో కలిసి ఆలయాల సందర్శన కోసం కేటాయించాడు. అయితే.. ఆలయం అందరు భక్తులతో పాటు కోహ్లీ-అనుష్క కూడా గర్భగుడి తలుపుల వద్ద ఒక మూలకు కూర్చోని ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ఏదో వచ్చామా? దేవుడ్ని దర్శించుకుని వెళ్లమా అని కాకుండా.. చాలా సాధారణంగా కింద కూర్చోని మరీ శివపూజలో పాల్గొనడంపై వారి వారి అభిమానులు ఈ విషయంలో వారిపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టాతలు ఉన్న వీవీఐపీ దంపతులు ఇలా సాధారణ భక్తులతో కలిసిపోయి పూజలో పాల్గొనడంపై సర్వత్ర ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. కాగా.. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన టీమిండియా.. మూడో టెస్టులో మాత్రం ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనే కాదు.. ఈ సిరీస్‌లోనే కోహ్లీ తన స్థాయి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. కేవలం 111 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. అయితే.. ఈ శివ పూజ తర్వాత అయినా కోహ్లీ తన పూర్వపు ఫామ్ అందుకోవాలని క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి మహాకాళేశ్వర ఆలయంలో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ చూపించిన సింప్లిసిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli & Anushka Sharma offered prayers to Lord Shiva.pic.twitter.com/qmOcnt1qy4
— Johns. (@CricCrazyJohns) March 4, 2023
Virat Kohli and Anushka Sharma visited the Mahakaleshwar Jyotirlinga Temple. pic.twitter.com/PwCoEYrBAo
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2023