క్రికెట్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ మరో రెండు రోజుల్లో జరగనుంది. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే టీమిండియా, పాకిస్థాన్ ఆటగాళ్లు యూఏఈ చేరుకుని ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. కాగా ఆసియా కప్‌లో భారత్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదీ గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. అయినా కూడా అతను పాక్ టీమ్‌తో కలిసి యూఏఈ చేరుకున్నాడు. ప్రాక్టీస్ చేసే చోట కాలికి కట్టుతో వచ్చి కూర్చుంటున్నాడు.
ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, యుజ్వేంద్ర చాహల్, రిషభ్ పంత్.. అఫ్రిదీని పరామర్శించారు. అతని దగ్గరి వెళ్లి ఎలా ఉండని తెలుసుకున్నారు. పాక్ ప్లేయర్‌ను ఇంత అప్యాయంగా పరామర్శించడంపై టీమిండియా ఆటగాళ్లకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఫాహీన్ అఫ్రిదీని యుజ్వేంద్ర చాహల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ పరామర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. షాహీన్ అఫ్రిదీ పాకిస్థాన్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. మోకాలి గాయం కారణంగా అతను జట్టుకు దూరమవ్వడం పాక్ టీమ్‌కు పెద్ద దెబ్బే. కాగా.. ఇండియా-పాకిస్థాన్ గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో తలపడగా.. అఫ్రిదీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అవుట్ చేసి భారత్‌ను దెబ్బతీశాడు.
ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ భారత్-పాకిస్థాన్ తొలి సారి తలపడబోతున్నాయి. కానీ.. అఫ్రిదీ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన ఓటమికి టీమిండియా ఆసియా కప్‌లో బదులు తీర్చుకోవాలని భావిస్తుండగా.. పాక్ టీ20 వరల్డ్ కప్ మొమెంటమ్‌ను కొనసాగించాలని కోరుకుంటుంది. ఇప్పటి వరకు ఐసీసీ మెగా టోర్నీల్లో పాకిస్థాన్‌పై టీమిండియాదే పైచేయిగా ఉండేది. కానీ.. టీ20 వరల్డ్ కప్‌ల్లో 2021 లీగ్ మ్యాచ్‌లో పాక్ చేతిలో భారత్ తొలిసారి ఓడింది. మరి ఆదివారం మ్యాచ్‌లో ఇరు జట్ల విజయావకాశాలపై, షాహీన్ అఫ్రిదీని కోహ్లీ, చాహల్, పంత్ పరామర్శించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shaheen Afridi 🤝 Indian team
Things you love to see 😍pic.twitter.com/mLmedwWcAf
— ESPNcricinfo (@ESPNcricinfo) August 25, 2022