‘ఐపీఎల్ 2021’ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిన విషయం తెలిసిందే. అసలు ఆర్సీబీ అంటేనే కోహ్లీ, డివిలియర్స్ ద్వయం. వీళ్లులేని ఆర్సీబీని ఊహించలేం. మరి, అంతపెద్ద స్టార్ ప్లేయర్లు ఉండి కూడా ఆర్సీబీకి ఒక్క ట్రోఫీ కూడా లేకపోవడం అభిమానులను బాధపెట్టే అంశం. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆర్సీబీకి ఒక్క ట్రోఫీ కూడా లేకపోవడం.. కెప్టెన్‌గా కోహ్లీ ట్రోఫీని అందించకపోవడం అభిమానులను అత్యంత బాధపెట్టిన అంశాలు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ, డివిలియర్స్ ముఖంలోనూ అదే బాధ కనిపించింది. ఈ ఇద్దరు కలిసి ట్రోఫీ అందించలేక పోవడం వారిని కూడా ఎంతో బాధకు గురిచేశాయి. మ్యాచ్ జరుగుతున్నంతసేపు, మ్యాచ్ అనంతరం కూడా వారి ముఖంలో ఆ బాధ కనిపించింది. మ్యాచ్ తర్వాత ఆ ఇద్దరు దిగ్గజాలు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించారు. ఆ విజువల్స్ మొత్తం క్రికెట్ ప్రపంచాన్నే కలచివేసింది. వాళ్లు కన్నీరు పెట్టుకోవడం చూసి ఆర్సీబీ అభిమానులే కాదు.. క్రికెట్ అభిమానులు అంతా ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీ, ఏబీడీ కన్నీళ్లు పెట్టుకున్న విజువల్స్ వైరలవుతున్నాయి. ఆర్సీబీ కప్పు కొట్టకపోవడానికి కారణం ఏమైఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Na valla kavatle ra babu 💔 pic.twitter.com/2LIyubCkO1
— Venkat Bhargav Paidipalli 🔔🦁 (@NBK_MB_cult) October 11, 2021