కొంత కాలంగా టీమిండియా ప్రదర్శన బాగానే ఉన్నా.. ఛాంపియన్ టీమ్ రేంజ్‌లో అయితే లేదు. చిన్నాచితక టీమ్స్‌పై సిరీస్‌లు క్లీన్ స్వీప్‌లు తప్పిస్తే.. పెద్దపెద్ద జట్లపై నిలకడగా ఆధిపత్యం చెలాయించలేకపోతుంది. తొలి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఓడిన భారత్.. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2021లోనూ నిరాశ పర్చింది. ఇలా బాగానే ఆడుతున్నట్లు కనిపిస్తున్నా.. గొప్ప గొప్ప విజయాలు మాత్రం రావడంలేదు. యువ క్రికెటర్లతో టీమిండియా కళకళలాడుతున్నా.. ఏదో మిస్ అవుతున్నట్లు మాత్రం అర్థం అవుతుంది. అదే సీనియరిటీ ప్లే. ప్రస్తుతం ఉన్న టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అంజిక్యా రహానే, చతేశ్వర్ పుజారా సీనియర్ ప్లేయర్లుగా ఉన్నారు. రోహిత్ శర్మ కూడా సీనియర్ ప్లేయరే అయినా అతను కెప్టెన్ కావడంతో అతని ఫామ్ విషయం పక్కన పెడితే.. విరాట్ కోహ్లీ, రహానే, పుజారా కొంతకాలం పూర్ ఫామ్‌తో ఇబ్బంది పడ్డారు. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారారనే విమర్శలు సైతం ఎదుర్కొన్నారు.
విరాట్ కోహ్లీకి విశ్రాంతి పేరుతో కొంత గ్యాప్ ఇస్తే.. రహానే, పుజారాపై ఏకంగా జట్టు నుంచి తొలగించి వేటు వేశారు. దీంతో ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ పూర్వవైభవం పొందడంపై దృష్టిపెట్టారు. టీమిండియాలో చోటు కోల్పోయిన తర్వాత పుజారా ఇంగ్లండ్ వెళ్లి కౌంటీల్లో ఆడి వరుస సెంచరీలు, డబుల్ సెంచరీలతో సంచలనం సృష్టించాడు. కొంత గ్యాప్ తీసుకున్న కోహ్లీ ఆసియా కప్‌లో రెండు హాఫ్‌సెంచరీలు, ఒక అద్భుత సెంచరీతో వింటేజ్ కోహ్లీని పరిచయం చేశాడు. తాజాగా రహానే దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. ఇలా టీమిండియా టెస్టు టీమ్‌లో మెయిన్ పిల్లర్లుగా ఉన్న ఈ ముగ్గురు ఏకకాలంలో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం వీరి ప్రదర్శన ఆధారంగా టీ20 వరల్డ్ కప్ తర్వాత జరగబోయే టెస్టు సిరీస్‌లకు వీరికి చోటు దక్కడం ఖాయం.
జట్టులో యువ క్రికెటర్లు నిండిఉన్నా.. టెస్టుల విషయం వచ్చే సరికి అనుభవం ఉన్న ఆటగాళ్లు ఎంతో అవసరం. ఓపికతో గంటల తరబడి బ్యాటింగ్ చేసే నైపుణ్యం అనుభవంతోనే సాధ్యం అవుతుంది. అందుకే టీమిండియా టెస్టు టీమ్‌లో కోహ్లీ, రహానే, పుజారా ఉంటడం జట్టుకు కొండంత బలం. పైగా ఈ ముగ్గురు ఫామ్‌లో ఉంటే.. ప్రత్యర్థి ఎవరైనా, పిచ్ ఎలాంటిదైనా బౌలర్లు తట్టుకోవడం కష్టం. అందుకే కెరీర్ ఆరంభం నుంచి పరుగుల వరద పారించిన ఈ ముగ్గురు మొనగాళ్లు.. దాదాపు ఒకే సారి ఫామ్ కోల్పోయారు. తిరిగి ఏక కాలంలోనే ఫామ్ పుంజుకున్నారు. దీంతో ఈ ముగ్గురు టీమిండియా టెస్టు టీమ్‌లో విత్ ఫామ్‌తో ఉంటే రాబోయే మూడేళ్లు టీమిండియాకు టెస్టుల్లో తిరుగుండదనే చెప్పాలి.
టీమిండియా కిరీటంలో వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి వజ్రాలు మెరుస్తున్నా.. కోహీనూర్ వజ్రం లాంటి టెస్టు ఛాంపియన్స్ షిప్ కోసం కొంత ప్లేస్ అలాగే మిగిలిపోయింది. తొలి సీజన్‌లో దాన్ని గెలిచే అవకాశం వచ్చిన టీమిండియా సాధించలేకపోయింది. ఇప్పుడు టెస్టు టీమ్ మెయిన్ పిల్లర్లు విరాట్ కోహ్లీ, అంజిక్యా రహానే, చతేశ్వర్ పుజారా భీకర ఫామ్‌లోకి రావడంతో.. రాబోయే టెస్టుల్లో టీమిండియా చెలరేగి ఆ లోటును తీర్చే సూచనలు కనిపిస్తున్నాయి. కోహ్లీ, పుజారా, రహానే ఫామ్‌లో ఉంటే వారిని అవుట్ చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. అందులోనూ టెస్టుల్లో అయితే బౌలర్లు అద్భుతం చేయాల్సిందే. మరి ఈ ముగ్గురు బ్యాటర్లు ఫామ్‌లోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆసియా కప్‌లో టీమిండియా వైఫల్యానికి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ
King Kohli is back and back. He is bloody good. What a player. pic.twitter.com/zoWS6Haiw9
— Johns. (@CricCrazyJohns) September 8, 2022
A Pujara which was hidden from the world for soo long👀#tigerexch #pujara #cricket #englandcricket #RoyalLondonCup pic.twitter.com/16A3Uo4wNO
— Tigerexch (@tigerexch) August 23, 2022
A 2⃣x comeback! 💯💯
Take a bow, @ajinkyarahane88 🙌#DuleepTrophy #WZvNEZ #QF1 #AmiKKR pic.twitter.com/HIBzcKZPG0
— KolkataKnightRiders (@KKRiders) September 9, 2022