రికార్డుల పుట్ట.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. వన్డే క్రికెట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేయడానికి విరాట్ కోహ్లీ అత్యంత చేరువలో ఉన్నాడు. విదేశాల్లో వన్డే క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్‌గా నిలవడానికి విరాట్ కోహ్లీ మరో 9 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇప్పటివరకు విదేశాల్లో వన్డేల్లో విరాట్ కోహ్లీ 5057 పరుగులు చేశాడు. ప్రస్తుతం విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. విదేశాల్లో సచిన్ 5065 పరుగులు చేశాడు.
దీంతో విరాట్ కోహ్లీ మరో 9 పరుగులు సాధిస్తే విదేశాల్లో వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత్ బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 254 వన్డే మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 59 సగటుతో 12169 పరుగులు చేశాడు. ఇందులో 43 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 183 పరుగులు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఈ రికార్డు సాధిస్తాడని విరాట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి కోహ్లీ ఈ రికార్డు సాధిస్తాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.