కోహ్లీకి కోట్లలో అభిమానులు ఉన్నారు. అతనిపై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తుంటారు. తాజాగా ఓ తెలుగు కుర్రాడు కోహ్లీపై ఆకాశాన్ని తాకేలా తన అభిమానం చాటుకున్నాడు. ఆ భారీ అభిమానాన్ని మీరూ చూడండి..
విరాట్ కోహ్లీ.. ఇండియన్ క్రికెట్‌లో ఈ పేరొక సంచలనం. క్రికెట్ అభిమానులు స్మరించే మంత్రం. కేవలం అతని ఆట చూసేందుకు స్టేడియానికి వచ్చే వారు వేలల్లో ఉంటే.. టీవీ ముందు కూర్చునే వారు కోట్లలో ఉంటారు. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక అభిమానులు ఉన్న క్రికెటర్‌గా కోహ్లీ పేరు చెప్పుకోవచ్చు. ట్విట్టర్లో 54 మిల్లియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 242 మిల్లియన్ల మంది కోహ్లీని ఫాలో అవుతున్నారు. ఈ రన్ మెషీన్ కి ఇండియాతో పాటుగా విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కొంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం కోహ్లీ విషయంలో ప్రత్యేకమైన అభిమానం చూపిస్తూ అందరిని అవాక్కయేలా చేస్తుంటారు. తాజాగా ఒక తెలుగు కుర్రాడు కోహ్లీ మీద చూపించిన అభిమానానికి ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు.
గతేడాది హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా 50 అడుగుల భారీ కటౌట్ ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇంత పెద్ద కటౌట్ ఇప్పటివరకు ఏ క్రికెటర్ కి కూడా లేకపోవడం గమనార్హం. అయితే ఇప్పుడు అంతకు మించి కార్తికేయ అనే ఖమ్మం కుర్రాడు గోడపై 60 అడుగుల పెయింటింగ్ ని వేయించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకొని నవ్వుతూ ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానం అనేది ఈ రేంజ్ లో ఉండడం కోహ్లీకి మాత్రమే సాధ్యం అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ కి సిద్ధం అవుతున్నాడు. ఈ మధ్య వరుస సెంచరీలు చేసి మునుపటి ఫామ్ ని అందుకున్న కింగ్ కోహ్లీ ఈ సారి ఆర్సీబీ జట్టుకి ఎలాగైనా టైటిల్ అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 31 న ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడబోతుంది. ఆర్సీబీ మాత్రం ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్ తో టైటిల్ వేట ప్రారంభించనుంది. ప్రస్తుతం ఐపీఎల్ హడావుడి నడుస్తుండగా తెలుగు కుర్రాడు కార్తికేయ కోహ్లీ కోసం వేయించిన పెయింటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
60 feet tall painting of Virat Kohli in Telangana.#24newscricket @assamcric pic.twitter.com/ty2PyB6xsg
— 24NewsCricket (@24newscricket) March 26, 2023