టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 100వ టెస్టు తొలి ఇన్నింగ్స్ ఆడేశాడు. ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లో ఎన్నో అంచనాల నడుమ బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ మంచి టచ్‌లో కనిపించాడు. చూడచక్కటి షాట్లతో బౌండరీలు బాదాడు. దీంతో తన 100వ మ్యాచ్‌లో వంద కొట్టడం ఖాయంగా కనిపించాడు. కానీ అనూహ్యంగా 45 పరుగుల వద్ద ఎంబెల్దేనియా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అయినా కూడా కోహ్లీ తన 100 టెస్టులో టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడని సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు. రోహిత్ శర్మ జెర్సీ నంబర్ 45 కాగా.. విరాట్ కోహ్లీ కూడా తన 100వ టెస్టులో సరిగ్గా 45 పరుగులే చేశాడు. దీంతో ఈ 45 పరుగుల ఫ్యాన్సీ నంబర్ రోహిత్ శర్మకు గిఫ్ట్ అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
విరాట్ కోహ్లీ స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ వర్మ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇద్దరి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్ నడిచింది. ఈ నేపథ్యంలో న్యూట్రల్ ఫ్యాన్స్ విరాట్ చేసిన 45 పరుగులు.. రోహిత్ శర్మ జెర్సీ నంబర్‌తో పోల్చుతూ గిఫ్ట్‌గా ఇచ్చాడంటూ పేర్కొంటున్నారు. మరి రెండో ఇన్నింగ్స్‌లోనైనా కోహ్లీ సెంచరీ చేయాలిన కోహ్లీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.1ST Test. WICKET! 43.3: Virat Kohli 45(76) b Lasith Embuldeniya, India 170/3 https://t.co/XaUgOQVg3O #INDvSL @Paytm
— BCCI (@BCCI) March 4, 2022
What a moment to commemorate his 100th Test appearance in whites 🙌🏻
Words of appreciation from the Head Coach Rahul Dravid and words of gratitude from @imVkohli👏🏻#VK100 | #INDvSL | @Paytm pic.twitter.com/zfX0ZIirdz
— BCCI (@BCCI) March 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.