క్రికెట్‌లో కింగులా ఎదిగిన కోహ్లీ చదివింది మాత్రం 12వ తరగతే. అయితే.. విద్యార్థి దశలో ఉన్నప్పుడు 10వ తరగతిని చాలా కీలకంగా భావిస్తారు. అలాంటి టెన్త్ క్లాస్‌లో కోహ్లీకి ఎన్ని మార్కులు వచ్చాయో? ఏ ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ స్పోర్ట్స్‌మెన్ అతనే. ప్రపంచ క్రికెట్‌లో ఒక మోడ్రన్ లెజెండ్‌లా ఎదిగిన కోహ్లీ.. ఆటలో అత్యున్నత శిఖరాలను అందుకున్నాడు. బ్యాటింగ్‌లో మరో సచిన్‌గా పేరుతెచ్చుకున్నాడు. కెప్టెన్‌గా టీమిండియాకు ఎంతో చేశాడు. ఇలా ఒక క్రికెటర్‌గా గొప్ప స్థాయికి ఎదిగిన కోహ్లీ.. చదివింది మాత్రం 12వ తరగతే. చదివింది తక్కువే అయినా.. దేశం గర్వించే క్రీడాకారుడిగా ఎదిగాడు. అయితే.. తాజాగా విరాట్ కోహ్లీ 10వ తరగతి మార్కుల షీటు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
2004లో కోహ్లీ 10వ తరగతి పాస్ అయినట్లు ఉన్న ఆ మార్కుల లిస్ట్‌లో కోహ్లీ ఒక సబ్జెక్ట్‌లో మంచి మార్కులు సాధించాడు. అది కూడా అందరికీ చాలా కష్టమైన ఇంగ్లీష్‌లో 83 మార్కులు సాధించాడు. అలాగే హిందీలో 75, మ్యాథ్స్‌లో 51, సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రాక్టీకల్స్‌తో కలిపి 81, సోషల్ సైన్స్‌లో 81, ఇంట్రోడక్టరీలో ప్రాక్టికల్స్‌తో కలిపి 74 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు చూసి.. కోహ్లీ మంచి స్టూడెంటే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ 2023 కోసం సిద్ధమవుతున్న కోహ్లీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో కలిసి బెంగళూరులో ఉన్నాడు. ఆర్సీబీ టీమ్ తన ఫస్ట్ మ్యాచ్‌ని ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్‌తో ఆడనుంది. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్ 2022 నుంచి కోహ్లీ మంచి ఫామ్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతేడాది ఐపీఎల్‌లో నిరాశపర్చిన కోహ్లీ.. ఈ సారి మాత్రం దుమ్మురేపుతానని అంటున్నాడు. అలాగే ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవలేకపోయిన ఆర్సీబీకి కప్పు అందించడమే లక్ష్యంగా కోహ్లీ బరిలోకి తిగుతున్నాడు.
It’s funny how the things that add the least to your marksheet, add the most to your character.
10th Marksheet of
@imVkohli
जय श्री राम#ViratKohli𓃵 pic.twitter.com/fm97q2JHMl— Raj (@MSD071845) March 30, 2023