అభిమానానికి చిన్నా.. పెద్దా.. వయసుతో సంబంధంలేదు. కంటికి నచ్చితే చాలు.. వారిని ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఇక సెలబ్రిటీల విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనం అభిమానించే వారిని ఎదుటివారు ఏమన్నా అంటే అస్సలు ఊరుకోం. అది మన అమ్మైనా సరే. ఈ క్రమంలోనే ఓ బుడ్డది విరాట్ కోహ్లీ గురించి ఏకంగా అమ్మతోనే గొడవకు దిగింది. వాళ్లమ్మ ధోని అంటుంటే.. ఈ బుడ్డది మాత్రం కింగ్ కోహ్లీ అంటూ.. గట్టిగా అరిచి అమ్మతో వాదిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వచ్చీరాని చిలకపలుకులతో కోహ్లీ కింగ్ అంటుంటే.. వినడానికి చూడముచ్చటగా ఉంది.
విరాట్ కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు ఒంటి చేత్తో తొలి విజయాన్ని అందించాడు. ఇక కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి మనకు తెలిసిందే. పాక్ లో సైతం విరాట్ కు డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరు ఒకెత్తు అయితే.. ఈ చిన్నారి అభిమాని మాత్రం ఒకెత్తు. కింగ్ కోహ్లీ కోసం తన తల్లిపైనే ఒక రకంగా యుద్దానికి దిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఏముందంటే.. తల్లిదండ్రులిద్దరు కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే తల్లి ధోని అని అరుస్తుంటే.. చిన్నారి మాత్రం కింగ్ కోహ్లీ.. అంటూ తల్లి కంటే గట్టిగా అరుస్తోంది.
ఈ క్రమంలోనే తల్లి మళ్లీ ధోని అంటే.. ఆమెకు చేయి చూపిస్తూ.. కోహ్లీ కింగ్ అంటూ అంతే గట్టిగా అరిచి చెప్తోంది. బుడ్డది ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు చెబుతోంది. చిన్నారికి అండగా తండ్రి కూడా కింగ్ కోహ్లీ అంటూ.. సపోర్టుగా నిలిచాడు. స్పష్టంగా మాటరాని ఈ బుడ్డది కింగ్ కోహ్లీ అంటుంటే.. వినడానికి ఎంతో చూడముచ్చటగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.”కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారని మరోసారి నిరూపించావ్ పాప” అని కొందరంటే..”ఈ చిన్నారి మాటలు వింటే కోహ్లీ కచ్చితంగా ఫిదా అవుతాడు” అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Cute ☺️@imVkohli | #T20WorldCup2022 | #T20WorldCup pic.twitter.com/VGINzdRtYS
— CricTracker (@Cricketracker) October 31, 2022