భారత్-పాక్ మ్యాచ్ అంటే యావత్ ప్రపంచం మెుత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది అనడంలో అతిశయోక్తిలేదు. కేవలం క్రీడా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా భారత్-పాక్ మ్యాచ్ ను ఆసక్తి కరంగా చూడటం విశేషం. ఇక ఆసియా కప్ 2022 సూపర్-4 లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ పై అలనాటి లేడీ సూపర్ స్టార్ బీజేపీ నాయకురాలు విజయ శాంతి తన దైన శైలిలో స్పందించారు. దీన్ని బట్టే అర్దం చేసుకోవచ్చు భారత్-పాక్ మ్యాచ్ కు ఎంత క్రేజ్ ఉందో. అయితే భారత్ ఈ మ్యాచ్ లో పరాజయం పాలు అయినప్పటికీ పాకిస్థాన్ భారత్ కు ఎప్పటికీ సమవుజ్జీ కాలేదని విజయ శాంతి పేర్కొన్నారు. ఈ మ్యాచ్ పై మరింత లోతుగా స్పందించారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
భారత్-పాక్ మ్యాచ్ జరగబోతోంది అంటే చాలు ఎక్కడ చూసినా.. పాన్ షాప్.. టీ షాప్.. ఆఖరికి గణేష్ మండపాల్లో కూడా దీని గురించే
చర్చ నడుస్తోంది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్ లో స్వయం కృపరాధం వల్ల భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఫీల్డింగ్, బౌలింగ్ లో ఇండియా ఆటగాళ్లు తేలిపోయారు. దాంతో దాయాది చేతిలో భారత్ చావుదెబ్బ తినింది. ఈ మ్యాచ్ పై బీజేపీ నాయకురాలు అలనాటి అందాల నటి విజయ శాంతి ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ మ్యాచ్ పై మరింతగా మాట్లాడుతూ..” పాకిస్థాన్ గెలిచిందని పాక్ లో వాళ్లు సంబరాలు చేసుకోవడంలో అర్ధం ఉంది కానీ ఓడిపోయినందుకు మనం బాధపడటంలో ఎలాంటి అర్ధం లేదు.
ఎందుకంటే పాక్ ఎప్పటికీ ఇండియాకు సమవుజ్జీ కాలేదు.. ఆ విషయం మనందరికి తెలిసిందే. ఇక ఇండియా పెద్ద జట్లు అయిన ఆసిస్, ఇంగ్లాండ్, కివీస్.. అలాగే పసికూనలైన జింబాబ్వే, హాంకాంగ్, ఆఫ్గానిస్తాన్ లాంటి జట్లపై విజయాలు సాధించిన టీమిండియాకు ఈ ఓటమి ఒక లెక్క కాదు. ఇక నిరంతరం మనని శత్రువుగా భావించి వారి డబ్బును మన వినాశనానికి ఉపయోగించి వారి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా నష్టపరుచుకుంటున్నారు. చివరికి జూలోని జంతువుల్ని కూడా అమ్ముకుంటూ ఉన్న దేశం మనకు ఏ మాత్రం సరితూగదు. ఈ మ్యాచ్ కు మీడియా కూడా అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఇక ఓలింపిక్స్ లాంటి దేశాల్లో చిన్న దేశాలు తమ తమ రంగాల్లో పాల్గొని పతకాలు సాధిస్తూంటాయని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే భారత జట్టు ఎన్నో రికార్డులను తిరగరాసిందని దానిని మనం మర్చిపోవద్దని పేర్కొన్నారు. ప్రస్తుతం విజయ శాంతి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సానుకూలంగా నెటిజన్స్ స్పందిస్తున్నారు. మరి ఇండియా-పాక్ మ్యాచ్ పై లేడీ సూపర్ స్టార్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిందని మనోళ్లు నిరాశ పడటం… గెలిచినందుకు పాక్ సంబరాలు చేసుకోవడం పూర్తిగా అర్థరహితం. భారత్‌తో ఎక్కువగా ఓడిపోతూ వస్తున్న పాక్‌లో వారి విజయాన్ని సంబరం చేసుకోవడం…. pic.twitter.com/xJmIq41B7w
— VIJAYASHANTHI (@vijayashanthi_m) September 5, 2022
మీడియా కూడా అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. టెన్నిస్, జిమ్నాస్టిక్స్, సాకర్, హాకీ లాంటి ఎన్నో క్రీడల్లో ప్రపంచ దేశాలన్నీ పెద్దవైనా… చిన్నవైనా పాల్గొని పతకాలు సాధిస్తుంటాయి. ఈ ఒక్క క్రికెట్ కోసం… ఇది మాత్రమే ఆట అన్నట్టు…
— VIJAYASHANTHI (@vijayashanthi_m) September 5, 2022