Vijay Shankar, World Cup 2023: దాదాపు అంతా మర్చిపోతున్న టైమ్‌లో మతిపోగొట్టే ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 24 బంతుల్లో 63 రన్స్‌తో అదరగొట్టాడు. దీంతో దెబ్బకు మళ్లీ వన్డే వరల్డ్ కప్ 2023కి టీమిండియాలో చోటు కోసం రేసులోకి వచ్చాడు.
ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా 2023 వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్‌లో పంత్, అయ్యర్, గాయాలతో ఆడడం అనుమానంగా మారింది. ఇక ఆదుకుంటాడునుకున్న సూర్య కుమార్ యాదవ్ కూడా వరుస పెట్టి గోల్డెన్ డకౌట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో మిడిల్ ఆర్థర్ లో ఇప్పుడు ఎవరిని ఎంపిక చేయాలో సెలక్టర్లకు పెద్ద సమస్యగా మారింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా నేనున్నాను అంటూ.. విజయ్ శంకర్ వరల్డ్ కప్ రేస్ లోకి రావడం ఆశ్చర్యంగా మారింది. ప్రస్తుతం ఇతని పేరు సెలక్టర్లు పరిగణించకపోయినా.. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేస్తే వచ్చే అవకాశలు లేకపోలేదు. మరి విజయ శంకర్ టీమిండియాలోకి నిజంగానే అడుగుపెడతాడా? అతని అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూదాం
2019 వరల్డ్ కప్‌లో శిఖర్ ధావన్ గాయంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు విజయ్ శంకర్. ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడిని కాదని విజయ్ శంకర్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపారు. అప్పట్లో 3డీ ప్లేయర్ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్)గా జట్టులో ఎంపిక చేశామని అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ చెప్పుకొచ్చాడు. అనుకున్నట్లుగానే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న ఈ ఆల్ రౌండర్ తొలి బంతికే వికెట్ తీసి వావ్ అనిపించాడు. కానీ ఆ తరవాత అంచనాలను అందుకోలేక విఫలవమవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి ఐపీఎల్‌తో సహా అన్ని టోర్నీల్లో ఫెయిల్ అవుతూ వచ్చాడు. దీంతో విజయ్ శంకర్ ని అందరూ మర్చిపోయారు.
తాజాగా ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ.. విజయ్ శంకర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో సునామి సృష్టించాడు. గుజరాత్ తరపున ఆడుతున్న విజయ్ శంకర్.. కేకేఆర్ బౌలర్లను ఊచ కోత కోశాడు. కేవలం 24 బంతుల్లో 63 పరుగులు చేసి ఆడేది విజయ్ శంకరేనా? అనే అనుమానం కలిగించాడు. ఈ ఇన్నింగ్స్ లో 5 సిక్సులు 4 ఫోర్లు ఉండడం విశేషం. ఇక ఈ ఇన్నింగ్స్ తో ఈ బ్యాటింగ్ ఆల్ రౌండర్ వరల్డ్ కప్ రేస్ లోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం జట్టులో పాండ్య ఒక్కడే ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కావడంతో అతనికి బ్యాకప్ గా వచ్చే అవకాశం లేకపోలేదు. సరిగ్గా వరల్డ్ కప్ టైం కి ఫామ్ లోకి వచ్చే విజయ్ శంకర్ ని ఈ సారి సెలెక్టర్లు ఏ మాత్రం కనికరిస్తారో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Vijay Shankar has decided to order new 3D glasses for surya or Iyer Ahead of 2023 World Cup. 😂 pic.twitter.com/j33e9qmChG
— Tarun Singh Verma 🇮🇳 (@TarunSinghVerm1) April 9, 2023
Vijay Shankar in odi worldcup 2023 ? pic.twitter.com/kqDwmbOg7t
— GoldenDuck (@goldenduckcrick) April 9, 2023