భారత మాజీ క్రికెటర్ ‘విజయ్ సింగ్ మాధవ్‌జీ మర్చంట్’ పేరిట జరిగే ప్రతిష్టాత్మక టోర్నీ ‘విజయ్ మర్చంట్ ట్రోఫీ‘లో ఓ చెత్త రికార్డు నమోదయ్యింది. అండర్ 16 స్థాయిలో జరిగే ఈ టోర్నీని బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అంతటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఒక బ్యాటర్.. ఒక బంతికి కొట్టగలిగే స్కోరుకు.. ఒక జట్టు ఆటగాళ్లలందరూ ఆలౌట్ అయ్యారు. అవును.. ఇది నిజం. దేశవాళీ జట్టైనా సిక్కిం ఈ చెత్త రికార్డును మూటకట్టుకుంది. టోర్నీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదయ్యింది.
తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 8 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. కెప్టెన్ మనల్ చౌహన్ 170 సెంచరీతో రాణించగా, ప్రతీక్ శుక్లా (86), ఆర్యన్ కుశ్వత్ (43), హర్షిత్ (43) పరుగులతో రాణించారు. అనంతరం సిక్కిం తొలి ఇన్నింగ్స్ లో 43 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కరణ్ 25 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు సిక్కిం బ్యాటర్లు డకౌట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న మధ్యప్రదేశ్ జట్టు, సిక్కింని ఫాలోఆన్ ఆడించింది. అంతే.. రెండో ఇన్నింగ్స్‌లో సిక్కిం బ్యాటర్లు దారుణ ఆట తీరు కనపరచారు. 9.3 ఓవర్లలో 6 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
వికెట్ కీపర్ అవ్‌నీశ్ ఓ ఫోర్ బాది 4 పరుగులు చేయగా, 9వ స్థానంలో వచ్చిన అక్షద్ 2 పరుగులు చేశాడు. మిగిలిన 9 మంది బ్యాటర్లు ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. 8 మంది బ్యాటర్లు డకౌట్ కాగా అందులో ఇద్దరు గోల్డెన్ డకౌట్ అయ్యారు. ఆఖరి స్థానంలో బ్యాటింగ్‌కి రావాల్సిన పర్వీణ్.. క్రీజులోకి రాకపోవడంతో అబ్సెంట్ హర్ట్‌గా అవుట్ అయ్యాడు. దీంతో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 365 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. కొద్ది రోజుల క్రితం బిగ్‌బాష్ లీగ్ 2022 టోర్నీలో సిడ్నీ థండర్ జట్టు 15 పరుగులకి ఆలౌట్ అయిన తెలిసిందే. ఈ ఘటన మరవకముందే ఇది జరగడం గమనార్హం.
Meanwhile 🤦🏻♂️🤦🏻♂️ Sikkim vs Madhyapradesh. In reply to Madhya Pradesh 414
But here is a question?
Sikkim in 1st innings 43
Sikkim in 2nd innings 6
Add some of both innings what you get?
For info Vijay Hazare is a u16 domestic tournament #VijayMerchant #iplauction2023 #IPLAuctions pic.twitter.com/kE8s47rJIR— Archisman Mishra (@iamarchis16) December 23, 2022