‘ఇండియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా’లో భారత్ కు గడ్డుకాలం కొనసాగుతూనే ఉంది. తొలి వన్డేలోనూ పరాభవం తప్పలేదు. 31 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధిచింది. ఇప్పుడు టీమిండియా ఓటమికి కారణాలు, ఎందుకు ఇలా జరిగింది అనే విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ కోహ్లీ- అశ్విన్ మధ్య ఉన్న బాండింగ్ గురించే చర్చలు మొదలు పెట్టారు. అందుకు కారణం లేకపోలేదు మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన అందుకు తెర లేపింది.
19 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయిన సౌత్ ఆఫ్రికా కాస్త బలపడుతూ కనిపించింది. ఆ సమయంలో 16వ ఓవర్ వేసేందుకు వచ్చిన అశ్విన్ మొదటి బంతికే విధ్వంసకర బ్యాటర్ క్వింటన్ డీకాక్ ను బౌల్డ్ చేశాడు. ఆ ఆనందంలో కోహ్లీ.. అశ్విన్ ను గట్టిగా హత్తుకుని వదలలేదు. బ్రో నన్ను వదిలితే నేను బౌలింగ్ చేయాలి అన్నట్లు అశ్విన్ ఎక్స్ ప్రెషన్ పెట్టాడు.
— Addicric (@addicric) January 19, 2022
మ్యాచ్ లో అవన్నీ కామన్ కదా అనుకోకండి. గతంలో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మనేదని.. అసలు అశ్విన్ అంటే విరాట్ కు పడదని, అతడిని టెస్టుల్లోకి రాకుండా అడ్డుపడుతోంది విరాట్ కోహ్లీనే అని.. అశ్విన్ కూడా విరాట్ ప్రవర్తనపై బీసీసీఐకి ఫిర్యాదు చేశాడంటూ ఎన్నో రూమర్స్ చక్కర్లు కొట్టేవి. అలాంటి తరుణంలో ఇలాంటి ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. విరాట్ అభిమానులు ‘ఎవరు చెప్పారు బ్రో.. అశ్విన్ అంటే విరాట్ కు పడదు అని?’ అంటూ ఈ వీడియో షేర్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Addicric (@addicric) January 19, 2022
Ashwin strikes !!!! Clean bowled Quinton De Kock…… Welcome back to ODIs 🤩🤩🔥🔥👌🏼👌🏼 #SAvIND #Cricket
— Sanskar Gemawat (@_SanskarG) January 19, 2022