సోషల్ మీడియా యుగంలో మంచైనా, చెడైనా వెంటనే వైరలవుతున్నాయి. ఇక సోషల్ మీడియా వల్ల రాత్రికి రాత్రే స్టార్లుగా మారిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ యువతి అద్భుతమైన బ్యాటింగ్ టాలెంట్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ప్రతిభ చూసి సచిన్ సైతం ఆశ్చర్యపోతున్నాడు. ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న ఆ వీడియో వివరాలు..
మన దేశంలో ప్రతిభావంతులకు కొదవ లేదు. కాకపోతే.. వారి టాలెంట్ వెలుగులోకి రావడానికి చాలా సమయం పడుతుంది.. ఒక్కోసారి వెలుగులోకి వచ్చేసరికి సదరు వ్యక్తుల జీవిత కాలాలు కూడా ముగుస్తాయి. అయితే ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఉన్నది సోషల్ మీడియా యుగం. నేటి కాలంలో ఏం జరిగినా సరే.. వెంటనే అది నెట్టింట వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. రాత్రికి రాత్రే స్టార్లుగా మారిన సామాన్యులు ఎందరో ఉన్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో మరో సూపర్ టాలెంటెడ్ యువతి హల్చల్ చేస్తోంది. ఆమె ప్రతిభ చూసి క్రికెట్ గాడ్ సచిన్ సైతం ఆశ్చర్యపోయాడు. సదరు యువతిని ప్రశంసిస్తూ.. ట్వీట్ చేయడంతో ఆ యువతి ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది.
మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రికెట్ మన దగ్గర ఒక మతంలా మారింది అంటే అతిశయోక్తి కాదు. క్రికెటర్లను దేవుళ్లగా భావించి.. అభిమానించి, ఆరాధించే ఫ్యాన్స్ మన దేశంలో కొకొల్లలు. ఇక క్రికెట్‌ను ఆడామగా అనే తేడా లేకుండా అభిమానిస్తారు. కొన్నేళ్లుగా ఆడపిల్లలు కూడా క్రికెట్‌లో రాణించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా టీ-20 మహిళల ప్రపంచ కప్ గెలిచి మన వాళ్లు సత్తా చాటిన సంగతి తెలిసిందే. మహిళా క్రికెట్‌కు కూడా ఆదరణ పెరుగుతుండటంతో.. జెంట్స్ ఐపీఎల్ మాదిరే లేడీ క్రికెటర్ల కోసం డబ్ల్యూపీఎల్ నిర్వహించేందుకు రెడీ అవ్వడమే కాక రెండు రోజుల క్రితం వేలం కూడా నిర్వహించారు.
ఇక ప్రస్తుతం టీమిండియాలో సూర్య కుమార్ యాదవ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న వివిధ సిరీస్‌లలో సూర్య కుమార్ యాదవ్ తన 360 డిగ్రీల అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటుతూ.. జట్టును గెలిపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ సాధారణ యువతి.. క్రికెట్‌లో అద్భుతమైన షాట్లు ఆడుతూ.. సూర్యకుమార్ యాదవ్‌ని గుర్తు చేస్తుంది. ప్రస్తుతం ఆ యువతి వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఈ వీడియోలో ఓ యువతి.. ఎలాంటి క్రికెట్ కిట్ లేకుండా.. అది కూడా ఇసుకలో.. ధనాధన్ షాట్లతో చేలరేగిపోయింది. డబ్ల్యూపీఎల్ 2023 వేలం జరిగిన మరుసటి రోజే ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడం విశేషం.
సదరు యువతి ప్రతిభకు నెటిజనుల ఆశ్చర్యపోతున్నారు. ఆమెను లేడీ సూర్య కుమార్ యాదవ్‌గా పోలుస్తున్నారు. ఇలాంటి మట్టిలో మాణిక్యాలకు సాన బెడితే మరింత మెరుగ్గా రాణిస్తారని.. సదరు యువతి ప్రతిభను గుర్తించాలని కోరుతూ.. ఈ వీడియోని బీసీసీఐ సెక్రటరీ జై షా, రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైభవర్ గహ్లోత్‌కు ట్యాగ్ చేశారు. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ వీడియో.. సచిన్ దృష్టికి వచ్చింది. సదరు యువతి టాలెంట్‌ని చూసి సచిన్ ఆశ్చర్యపోయారు. నిన్ననే వేలం జరిగింది.. ఈరోజు మ్యాచ్ ప్రారంభం అయ్యింది.. నేను మీ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నాను అంటూ కామెంట్ చేశాడు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ సైతం సదరు యువతిపై ప్రశంసలు కురిపించారు. మరి ఈ యువతి ప్రతిభను చూస్తే మీకేమనిపిస్తుంది.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Kal hi toh auction hua.. aur aaj match bhi shuru? Kya baat hai. Really enjoyed your batting. 🏏👧🏼#CricketTwitter #WPL @wplt20
(Via Whatsapp) pic.twitter.com/pxWcj1I6t6
— Sachin Tendulkar (@sachin_rt) February 14, 2023
Amazed by the young girl’s cricket skills & passion for the game! I’m glad to see that the future of Women’s Cricket is in good hands. Let us work together to empower our young athletes so that they can become future game changers! #GirlsInCricket #FutureStars @wplt20 @BCCIWomen pic.twitter.com/Bw5yv151wI
— Jay Shah (@JayShah) February 14, 2023
ये वीडियो राजस्थान की बताई जा रही है। जिस तरह ये बेटी शॉट्स लगा रही है इसकी बैटिंग में सूर्यकुमार यादव की झलक है। ऐसे टैलेंट को प्रमोट कर अच्छी ट्रेनिंग मिलनी चाहिए। @ashokgehlot51 जी, इस बच्ची के टैलेंट को सही मंच दिलाएँ जिससे ये एक दिन देश की जर्सी पहने। pic.twitter.com/vd1TkhVeVt
— Swati Maliwal (@SwatiJaiHind) February 13, 2023