ఆస్ట్రాలజర్ వేణుస్వామి అంటే నెటిజన్స్ టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే తెలుగు సినీ స్టార్స్ గురించి ఆయన ఎప్పుడూ ఏదో విషయం చెబుతూనే ఉంటారు. సినిమా స్టార్స్ అనే కాదు మన దేశానికి చెందిన పలువురు ప్రముఖల లైఫ్, ఫ్యూచర్ గురించి చెప్పే ఈయన.. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. ఇప్పుడు కూడా ఏకంగా దేశాలు దాటేసినట్లు ఉన్నారు. ఎందుకంటే ప్రముఖ విదేశీ క్రికెటర్ కూడా ఆయనతో జాతకం చెప్పించుకోవడంతో ఈ విషయం వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతి మనిషికి కూడా తన భవిష్యత్తు ఏమవుతుందో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంటుంది. అందులో సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఎవరు కూడా అతీతం కాదు. అలా జాతకాలు చెప్పిన ఫేమస్ అయినవారిలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఒకరు. ఒకప్పటి హీరోల దగ్గర నుంచి లేటెస్ట్ యంగ్ హీరోయిన్ల వరకు ఈయన జాతకాలు చెప్పారు. పలువురు రాజకీయ నాయకుల జాతకాల్ని కూడా ఈయన చెప్పారు. ఫర్ ద ఫస్ట్ టైమ్.. విదేశీ క్రికెటర్ అంటే కివీస్ ఆటగాడు ఇష్ సోదీ ఈయనతో జాతకం చెప్పించుకున్నాడు.
భారత్ లోని పంజాబ్ లో పుట్టిపెరిగిన ఇష్ సోదీ కుటుంబం న్యూజిలాండ్ లో సెటిలైంది. అలా అక్కడ పెరిగిన అతడు.. స్పిన్నర్ గా గుర్తింపు తెచ్చుకుని జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. కివీస్ జట్టు తరఫున భారత్ లోనూ మ్యాచ్ లాడాడు. ఐపీఎల్ లో పలు మ్యాచుల్లో ఆకట్టుకునే ప్రదర్శనలు చేశాడు. ఇక తాజాగా వేణుస్వామి న్యూజిలాండ్ వెళ్లినట్లున్నారు. ఈ సందర్భంగా అనుకోకుండా ఆయన ఇష్ సోదీని కలిసినట్లున్నారు. అలా ఈ వీడియో బయటకొచ్చినట్లు కనిపిస్తుంది. మరి వేణుస్వామి జాతకాలు చెప్పడం విదేశాలకు, అది కూడా న్యూజిలాండ్ క్రికెటర్ల వరకు వెళ్లడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.