ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సరే మన వాళ్లు కచ్చితంగా ఉంటారు. జస్ట్ ఉన్నారంటే ఉండటం కాకుండా ప్రతి రంగంలోనూ డామినేషన్ చూపిస్తుంటారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రఖ్యాత కంపెనీలకు సీఈఓలు ఉన్నది మనవాళ్లే. అది మన రేంజ్. ఇప్పుడు విదేశీ క్రికెట్ జట్లలోనూ మన అమ్మాయిలు డామినేషన్ చూపిస్తున్నారు. తాజాగా అమెరికా జట్టు ఫొటో రిలీజ్ చేయగా.. ప్రతి ఒక్కరు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మరో విశేషం. ఇక ఇందులో ఏకంగా కెప్టెన్ సహా ఐదుగురు అమ్మాయిలు తెలుగు వాళ్లే కావడం స్పెషాలిటీ
ఇక వివరాల్లోకి వెళ్తే.. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా మహిళల అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. దీనికోసం యూఎస్ఏ తమ జట్టును ప్రకటించింది. ఇక్కడ రెండు ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అమెరికా 2010లో పురుషుల అండర్-19 ప్రపంచకప్ ఆడింది. తాజాగా ఆ దేశ మహిళా జట్టు తొలిసారి ప్రపంచకప్ కోసం బరిలో దిగేందుకు సిద్ధమైంది. జనవరి 7 నుంచి జనవరి 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. 16 జట్లు పాల్గొంటున్నాయి. ఇక అండర్-19 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్న గ్రూప్ ఏలో యూఎస్ఏ ఉంది. ఇక ఈ జట్టులో 15మంది ఉండగా.. అందులో అందరూ కూడా భారత సంతతికి చెందిన అమ్మాయిలే. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ చంద్రపాల్.. ఈ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టు జనవరి 14న శ్రీలంక, జనవరి 16న ఆస్ట్రేలియా, జనవరి 18న బంగ్లాదేశ్ తో మ్యాచులు ఆడనుంది.
యూఎస్ఏ జట్టు: గీతిక కొడాలి(కెప్టెన్), అనికా కొలన్ (వైస్ కెప్టెన్), అదితి చుదసామ, భూమిక భద్రిరాజు, దిశా దింగ్రా, ఇసాని వంగేలా, జివానా అరాస్, లాస్య ముళ్లపూడి, పూజా గణేశ్, పూజా షా, రితూ సింగ్, సాయి తన్మయి, స్నిగ్ధ పాల్, సుహాని తదాని, తరనుమ్ చోప్రా
📡MEDIA RELEASE: USA Cricket Women’s U19s Squad for Historic First World Cup Appearance Named
15-player squad to represent Team USA is named for the inaugural ICC Under-19 Women’s T20 World Cup in South Africa next month
➡️: https://t.co/xB789FYppc#WeAreUSACricket🇺🇸 #U19CWC pic.twitter.com/x6Y00UXrE7
— USA Cricket (@usacricket) December 14, 2022