టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌పై బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా మరోసారి రెచ్చిపోయింది. పరోక్షంగా పంత్‌ను కౌగర్ హంటర్(తన కంటే ఎక్కువ వయసున్న అందమైన అమ్మాయిలతో లైంగిక సంబంధం కోరుకునే పురుషుడు)గా పేర్కొంటూ తన తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్టు చేసింది.
దీని కంటే ముందు పంత్‌తో తన రిలేషన్ షిప్, బ్రేకప్ వంటి విషయాలపై ఊర్వశి ఇటివల ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పంత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ఆర్‌పీగా పేర్కొంటూ అంతను నా కోసం హోటల్‌కు వచ్చి చాలా సేపు వెయిట్ చేసి వెళ్లిపోయాడని, తర్వాత తామిద్దరం ముంబైలో కలుసుకున్నామని, ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. అతను తనతో మాట్లాడటం మానేశాడని ఊర్వశి వెల్లడించింది.
ఈ ఇంటర్వ్యూ తర్వాత పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కొంతమంది ఫేమ్, పాపులారిటీ కోసం ఇన్ని అబద్ధాలు ఎలా చెబుతారో.’ ‘చెల్లెమ్మా నన్ను వదిలేయ్..’ అంటూ పరోక్షంగా ఊర్వశిని ఉద్దేశిస్తూ స్పందించాడు. పంత్ వ్యాఖ్యలు ఒక్కసారిగా హీట్ పుట్టించాయి. పంత్ కామెంట్‌కు కౌంటర్‌గా ఊర్వశి గురువారం ఒక ఇన్‌స్టా పోస్టు చేసింది అందులో..‘ఛోటూ భయ్యా నువ్వు బ్యాట్ బాల్‌తో ఆడుకో.. నేను మున్నిని కాదు.. నీ లాంటి పిల్లా బచ్చా డార్లింగ్ వల్ల బద్నాం అవ్వడానికి’ అంటూ పేర్కొంది.
ఈ పోస్టుకు నాలుగు హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించింది. రక్షాబంధన్ శుభాకాంక్షలు, ఆర్‌పీ ఛోటుభయ్యా, కౌగర్ హంటర్, డోంట్ టేక్ అడ్వంటేజ్ ఆఫ్ ఏ సైలెంట్ గర్ల్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టింది. ప్రస్తుతం ఊర్వశి చేసిన ఈ పోస్టు సంచలనంగా మారింది. కాగా గతంలో వీరిద్దరూ కాగా గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఏమైందో తెలియదు కానీ.. ఆ తర్వాత ఊర్వశిని సోషల్ మీడియాలో బ్లాక్ చేసి, కొద్ది రోజులకే ఇషా నేగి అనే మోడల్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు పంత్ ప్రకటించి సంచలనం సృష్టించాడు.
దీంతో ఊర్వశికి, పంత్‌కు మధ్య ఏం లేదని అంతా భావించారు. కానీ.. ఊర్వశి మాత్రం ఛాన్స్ దొరికినప్పుడల్లా పంత్ గురించి పరోక్షంగా మాట్లాడుతూనే ఉంది. ఇప్పుడు తాజా ఊర్వశి ఇచ్చిన ఇంటర్వ్యూతో మరోసారి ఇద్దరి గురించి చర్చ మొదలైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఫేమ్ కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఊర్వశిపై పంత్ ఫైర్