ఐపీఎల్ తర్వాత అంతటి ప్రచుర్యం పొందిన క్రికెట్ టోర్నీ.. బిగ్ బాష్ లీగ్. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ లీగ్‌లో తొలిసారి ఒక ఇండియన్ క్రికెటర్ ఆడుతున్నాడు. ఈ రోజు హోబర్ట్ హరికేన్స్, మెల్‌బోర్న్ రెనెగేట్స్ మధ్య జరుతున్న మ్యాచ్‌లో టీమిండియా అండర్ 19, టీమిండియా ఏ మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ బరిలోకి దిగాడు. మెల్‌బోర్న్ రెనెగేట్స్ తరపున బరిలోకి దిగిన చంద్.. భారత్ తరపున బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
.@UnmuktChand9 becomes first Indian male cricketer to play in Big Bash League
READ: https://t.co/PbSzs3yIIz #UnmuktChand #BBL #bigbashleague pic.twitter.com/pVVKSJN34B
— TOI Sports (@toisports) January 18, 2022
కాగా ఉన్ముక్త్ చంద్ టీమిండియా తరపున ఆడకున్నా.. భారత్‌కు అండర్ 19 వరల్డ్ కప్ అందించాడు. అలాగే ఐపీఎల్‌లో 2011-13 మధ్య ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు, 2015-16లో ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. మొత్తం 21 మ్యాచ్‌లు ఆడిన చంద్.. 300 పరుగులు చేశాడు. ఇటివల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఉన్ముక్త్ బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్నాడు. మరి భారత్ నుంచి బిగ్ బాష్ లీగ్‌లో ఉన్ముక్త్ చంద్ ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.