టీమిండియా- బంగ్లాదేశ్‌లో చేసిన ఈ టూర్‌లో రెండో వన్డే అందరికీ గుర్తుండిపోతుంది. నిజానికి రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌ని గెలిపించి ఉన్నట్లైతే గొప్పగా గుర్తుపెట్టుకునేవారు. కానీ, అంత పోరాడినా ఓటమి తప్పకపోవడంతో అంతా నెట్టింట ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అయితే మ్యాచ్ ఓడిపోయిన బాధలో అభిమానులు వంద మాట్లాడతారు. వాటిని ఎవరూ అంతగా పట్టించుకోరు. కానీ, మాట్లాడే మాట, చేసే ట్రోలింగ్ కాస్త అర్థవంతంగా కూడా ఉండాలి. ఎందుకంటే ఓపెనింగ్ బ్యాటర్ 10 ఓవర్లు బౌలింగ్ చేయలేదు ఎందుకు? అని ప్రశ్నించడం చాలా వెర్రితనంగా ఉంటుంది. మరి.. అలాగే ఫుల్‌టైమ్ బౌలర్ బ్యాటింగ్ చేయలేదని ట్రోలింగ్ చేయడం ఎంత వరకు కరెక్ట్?
ఈ మ్యాచ్‌లో బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 19 ఓవర్లకి 6 వికెట్లు తీసిన బౌలర్లు.. బౌలింగ్ ఆల్రౌండర్ మెహిదీ హసన్‌తో సెంచరీ చేయించారు. సరే.. అది అయిపోయిందని వదిలేశారు. తర్వాత చూస్తే బ్యాటింగ్ కూడా అంతే పేలవంగా చేశారు. టాపార్డర్‌లో శ్రేయాస్ అయ్యర్ మినహా మరెవరూ రాణించలేదు. తర్వాత అక్షర్ పటేల్ కాసేపు మ్యాచ్ మీద ఆశలను సజీవం చేశాడు. కానీ, తర్వాత మళ్లీ సంకటంలో పడిపోయాం. తర్వాత వచ్చిన రోహిత్ శర్మ వీర విహారం చేశాడు. 28 బంతుల్లో 51 పరుగులు చేశాడు. కానీ, మ్యాచ్‌ని 5 పరుగుల తేడాతో ఓడిపోయాం. అందుకు కారణంగా సిరాజ్‌ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అతని బ్యాటింగ్ వల్లే మ్యాచ్ ఓడిపోయాం అంటూ కామెంట్ చేస్తున్నారు.
MOM #siraj https://t.co/2F8kyeYVjW pic.twitter.com/zuaws2Z9S5
— ASHISH PATHAK (@AshishPathak120) December 7, 2022
రోహిత్ శర్మ 9వ స్థానంలో మ్యాచ్‌లోకి అడుగుపెట్టాడు. వచ్చినప్పటి నుంచి బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే సిరాజ్ 48వ ఓవర్‌లో స్ట్రైక్ ఛేంజ్ చేసేందుకు నానా తిప్పలు పడ్డాడు. కానీ, ఓవర్ మొత్తంలో ఒక్క బాల్‌ని కూడా కనీసం బ్యాట్‌కి తాకించలేకపోయాడు. అందుకే ఇప్పుడు సిరాజ్‌ని తిడుతున్నారు. ఆ ఓవర్‌లో కనీసం ఒక్క సింగిల్ తీసినా కూడా మ్యాచ్ గెలిచేవాళ్లం అంటూ మాటలు చెబుతున్నారు. అయితే ఇక్కడ అందరికీ అంతు పట్టని ప్రశ్న ఏంటంటే.. సిరాజ్ కంటే ముందు పెవిలియన్ చేరిన ఎనిమింది బ్యాటర్లను తిట్టని తిట్లు సిరాజ్ నే ఎందుకు తిడుతున్నారు. విరాట్ కోహ్లీ(5), శిఖర్ ధావన్(8), వాషింగ్టన్ సుందర్(11), కేఎల్ రాహుల్(14), శార్దూల్ ఠాకూర్(7), దీపక్ చాహర్(11) వీళ్లందరినీ ట్రోల్ చేయని వాళ్లు మహ్మద్ సిరాజ్(2)నే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?
I am just confused why are some people attacking on Siraj for wasting balls. Yes, he should’ve rotated strike but he is bad with bat obviously.
If Siraj is hated for his batting, Indian batters should be hated for not being good enough to contribute anything with the ball.
— Shallow Marshmallow (@fancyAcupppaaaa) December 7, 2022
ఆడిన 15 వన్డేల్లో 4.83 సగటుతో 23 వికెట్లు తీసిన ఫుల్ టైమ్ టీమిండియా బౌలర్‌ని బ్యాటింగ్ చేయలేదని ట్రోల్ చేయడం ఎంత వరకు కరెక్ట్? అలా చూసుకుంటే ఫుల్ టైమ్ బౌలర్లు ఫెయిల్ అయ్యారని.. ఏ బ్యాట్స్‌మన్ కూడా వచ్చి బౌలింగ్ చేయలేదు కదా? ఇప్పుడు సిరాజ్‌ని ట్రోల్ చేయడం చూస్తుంటే.. మరి బ్యాట్స్‌మన్లు కూడా బౌలింగ్ వేయడం లేదని వారిని కూడా ట్రోల్ చేయాలి. అయితే ఈ విషయంలో మరోవైపు సిరాజ్‌కి కూడా నెట్టింట మద్దతు లభిస్తోంది. సిరాజ్‌ని బ్లేమ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదంటూ హితవు పలుకుతున్నారు. ఫెయిల్ అయిన బ్యాట్స్‌మన్లను వదిలేసి.. కేవలం సిరాజ్‌ని ట్రోల్ చేయడం సమంజసం కాదంటూ కామెంట్ చేస్తున్నారు.
Siraj apni batting skill pe kaam karo agar aap single nhi nikal sakte ek poore over me then aap int jyada nhi khel sakte 😓👎 https://t.co/JE4gc3bsV3
— Himanshu samadhiya (@Himanshusamad18) December 7, 2022