ఎంతో మంది గొప్ప గొప్ప క్రికెటర్లు, స్టార్ ఆటగాళ్లు తమ స్కూల్ ఏజ్‌లోనే లాంగ్ ఇన్నింగ్స్‌లు ఆడి పేరు తెచ్చుకున్నారు. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, సర్ఫారాజ్ ఖాన్, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు సైతం చిన్న వయసులోనే అద్భుత ఇన్నింగ్స్‌లు జాతీయ స్థాయికి రాకముందే గుర్తింపు పొందారు. ఇప్పుడు వారి పేర్ల సరసన మరో యువ క్రికెటర్ పేరు కూడా చేరింది. అతని పేరే తన్మయ్ సింగ్. 13 ఏళ్ల ఈ కుర్రాడు.. అండర్-14 టోర్నమెంట్‌లో చరిత్ర సృష్టించాడు. ఫోర్లు, సిక్సుల వర్షం కురిపిస్తూ.. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ.. కేవలం 132 బంతుల్లోనే 401 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. తన్మయ్ ఇన్నింగ్స్‌లో 30 ఫోర్లు, 38 సిక్సులు ఉండటం విశేషం. అతను కొట్టిన సిక్సులతోనే డబుల్ సెంచరీ పరుగులు వచ్చాయి.
దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్, ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ మధ్య సోమవారం అండర్-14 మ్యాచ్ జరిగింది. గ్రేటర్ నోయిడాలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ర్యాన్ స్కూల్ కెప్టెన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతను తీసుకున్న నిర్ణయమే ర్యాన్ స్కూల్ బౌలర్లకు శాపంగా మారింది. దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున బ్యాటింగ్‌కు దిగిన 13 ఏళ్ల తన్మయ్ సింగ్.. ఆకాశమే హద్దుగా విజృంభించాడు. బాల్ పడితే.. సిక్స్, మిస్ అయిందా ఫోర్ అన్న రీతిలో బ్యాటింగ్ చేశాడు. తన్మయ్ పవర్ హిట్టింగ్ ముందు ర్యాన్ స్కూల్ బౌలర్లు నిలువలేకపోయారు. అతని ఊచకోత ముందు తేలిపోయారు. తన్మయ్ 401 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ జట్టు 656 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఈ అతి భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ టీమ్ కేవలం 193 పరుగులకే కుప్పకూలి.. 463 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే.. 401 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తన్మయ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు. స్కూల్ టైమ్‌లో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, సర్ఫారాజ్ ఖాన్, పృథ్వీ షా ఆడినట్లే ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడి వార్తల్లో నిలిచాడు. స్కూల్ టైమ్‌లో సచిన్ 326, వినోద్ కాంబ్లీ 349, సర్ఫారాజ్ ఖాన్ 639, పృథ్వీ షా 546 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన్మయ్ 401 పరుగులతో వారి సరసన నిలిచాడు. మరి ఈ కుర్రాడు ఇలాగే రాణించి.. త్వరలో టీమిండియాకు ఆడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. మరి తన్మయ్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
तुफान धुलाई! १३ वर्षांच्या मुलाने ठोकले ३८ षटकार अन् ३० चौकार, पाडला धावांचा पाऊस#tanmay #Cricket https://t.co/ioiCVINd3X
— Lokmat (@lokmat) December 19, 2022