ఉమ్రాన్ మాలిక్ టీమిండియాకు దొరికిన ఒక వజ్రాయుధం. జమ్మూకశ్మీర్‌లో పుట్టిన మట్టిలో మాణిక్యం. అయితే ఈ వజ్రాయుధానికి రెండు వైపులా పదునే.. సరిగ్గా వాడితే విజయం, లేదంటే వైఫల్యం ఖాయం. ఎందుకంటే.. వేగంతో ఎంత ఉపయోగం ఉంటుందో అంతే స్థాయిలో ప్రమాదం కూడా ఉంటుంది. లైన్ కాస్త తప్పితే, బ్యాటర్ సరిగ్గా టైమ్ చేస్తే చాలు.. ఫీల్డర్లు కాలు కదపనవసరం లేకుండా బాల్ బౌండరీ చేరుతుంది. ఇలా రెండు వైపుల పదనుండే ఈ జమ్మూ ఖడ్గం.. ఇప్పుడు కాస్త ‘లైన్’లోకి వచ్చింది. గతేడాదే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్.. వేగంతో మాత్రమే ఆకట్టుకున్నాడు. కానీ.. ఇప్పుడు మరింత పరిణతి చెంది.. కళ్లు చెదిరే స్పీడ్‌తో పాటు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో టీమిండియాకు 2023 నూతన ఏడాదిలో తొలి విజయాన్ని అందించాడు.
మంగళవారం భారత్-శ్రీలంక మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు శ్రీలంక.. భారత పర్యటనకు వచ్చింది. శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం యంగ్ టీమిండియా బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్ రాణించారు. దీంతో శ్రీలంక ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచగలిగారు. అయితే.. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి శివమ్ మావీ లంక బ్యాటర్లను ఆరంభంలోనే దెబ్బ తీశాడు. తన తొలి ఓవర్‌లో అద్భుతమైన ఇన్‌స్వింగ్ డెలవరీతో నిస్సంకాను క్లీన్ బౌల్డ్ చేసిన మావీ, తన మరుసటి ఓవర్‌లో మరో వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత ఉమ్రాన్ మాలిక్ ఒకటి, హర్షల్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టడంతో.. లంక 14.3 ఓవర్లలో 108 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
అయితే.. శ్రీలంక కెప్టెన్ షనక మాత్రం ఓటమిని ఒప్పుకోలేదు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 45 పరుగులు చేసి.. లంకను గెలిపించేలా కనిపించాడు. అతను క్రీజ్ ఉంటే లంకదే గెలుపు. కానీ.. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసేందుకు వచ్చిన ఉమ్రాన్ మాలిక్.. షనకను తన స్పీడ్‌తో బోల్తా కొట్టించాడు. 45 రన్స్‌తో అద్భుతంగా ఆడుతున్న షనక.. అసలైన పేస్ బౌలింగ్ రుచి చూసి.. వికెట్ సమర్పించుకున్నాడు. ఏకంగా గంటకు 155 కిలో మీటర్ల వేగంతో ఉమ్రాన్ వేసిన బాల్‌కి తడబడిన షనక.. మిస్ టైమ్ చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కీలకమైన దశలో షనకను అవుట్ చేయడం ద్వారా ఉమ్రాన్ మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. గతంలో కేవలం వేగాన్ని మాత్రమే నమ్ముకున్న ఉమ్రాన్‌లో.. ఇప్పుడు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ కనిపించింది.
బ్యాటర్‌ను వణికించే వేగానికి కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తోడైంది. ఈ మ్యాచ్‌లో తన 4 ఓవర్ల కోటా పూర్తి చేసిన ఉమ్రాన్.. కేవలం 27 రన్స్ ఇచ్చి.. 2 వికెట్లు పడగొట్టాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో షనకను అవుట్ చేసిన డెలవరీని 155 స్పీడ్‌తో వేయడం ద్వారా భారత తరఫున అత్యంత వేగవంతమైన బాల్ వేసిన బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ రికార్డు సృష్టించాడు. గతంలో జస్ప్రీత్ బుమ్రా 153.36 వేగంతో వేసిన బాల్ నంబర్ వన్‌గా ఉంది. ఆ రికార్డును ఉమ్రాన్ ఇప్పుడు తుడిచిపెట్టాడు. మరి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌తో పాటు లంకతో మ్యాచ్‌లో అతని ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Umran Malik clocked 155kmph in his final over. #UmranMalik #INDvSL #TeamIndia, #HardikPandya pic.twitter.com/8V6yx3kbBV
— Nurjamal Dutta (@DuttaNurjamal) January 4, 2023
155 km/hr, the fastest delivery by an Indian bowler. #UmranMalik#INDvsSLpic.twitter.com/KOo5TxJj2K
— Deepali Pandey (@deepalipandey) January 4, 2023