సన్‌రైజర్స్ హైదరాబాద్ నయా పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్.. ఐపీఎల్-2022లో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. గంటకు 150 కీ.మీ. పైగా వేగంతో బంతులేస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లను దడదడలాడించాడు. పరుగులిచ్చినప్పటికీ.. కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మొత్తానికి తన ప్రదర్శనలతో జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్ లో తనకు జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. ఉమ్రాన్ బౌలింగ్ శైలిని పలువురు మాజీ ఆటగాళ్లు పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ ను పోల్చుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ స్పందించాడు.
తనను వకార్ యూనిస్ తో పోల్చడంపై స్పందించిన ఉమ్రాన్..”నా బౌలింగ్ శైలి సహజంగా వచ్చిందే. ఎవరినీ కాపీ కొట్టలేదు. నేను వకార్ యూనిస్ ను ఫాలో కాను. నాకంటూ ఓ బౌలింగ్ స్టైల్ ఉంది. దాన్నే ఫాలో అవుతా. ఇక ఆరాధ్య క్రికెటర్లంటారా.. టీమిండియా స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ భాయ్.. వీళ్లే నేను ఆరాదించే బౌలర్లు. నా కెరీర్ ఆరంభం నుంచే ఈ ముగ్గరి దిగ్గజాలనే అనుసరిస్తూ వస్తున్నా. దేశం తరపున ఆడుతుండటం నాకు గర్వంగా ఉంది. నా దేశం కోసం నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో నాకు అవకాశం లభించింది. సిరీస్ గెలిచేందుకు నా వంతుగా కృషి చేయాలి” అని తెలిపాడు.
Umran Malik on his Idols! 🗣️#TeamIndia #ENGvNZ #INDvSA #ENGvsNZ #SLvAUS #ENGvsNZ #SLvsAUS #UmranMalik pic.twitter.com/eyfGu5znhE
— CricBouncer (@Cricket_Bouncer) June 6, 2022
ఇక అక్తర్ ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు గురించి స్పందిస్తూ.. ‘ప్రస్తుతానికైతే నా దృష్టంతా బాగా బౌలింగ్ చేయాలి. సౌతాఫ్రికాతో సిరీస్ లో నా దేశం ఐదు మ్యాచులు గెలిచేందుకు నేను మంచి ప్రదర్శన చేయాలి అనేదానిమీదే ఉందే తప్ప దాని (షోయభ్ అక్తర్ రికార్డు) మీద లేదు. దాని గురించి తర్వాత ఆలోచిస్తా..’ అని చెప్పుకొచ్చాడు.
Umran Malik wants to Win India all 5 matches against South Africa #INDvSA #UmranMalik #TeamIndia pic.twitter.com/0vKQM3duwR
— Cricket Addictor (@AddictorCricket) June 6, 2022
ఇది కూడా చదవండి: Kapil Dev: సచిన్ తనయుడిపై ‘కపిల్ దేవ్’ సంచలన కామెంట్స్!
ఉమ్రాన్ మాలిక్.. పాకిస్తాన్ స్టార్ పేసర్ షోయభ్ అక్తర్ ఫాస్టెస్ట్ డెలివరీ (గంటకు 161.3 కిలోమీటర్లు) కూడా బ్రేక్ చేస్తాడని పలువురు మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్ 22 వికెట్లు పడగొట్టాడు. మరి.. ఉమ్రాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Umran Malik has bowled 31 deliveries over 150+kmph in IPL 2022….
..#ipl #umranmalik #ipl9 #iplik #ipl10 #playtown #iplayslinky #ipltreatment #iplworlds #iplaytoomuch #iplayeastman #iplug #iplhairremoval #iplay #iplt20 #iplehouse #iplanevents #ipleadthe2nd #ipledge #iplann pic.twitter.com/iolAGQyaTr
— Cricsky (@Cricsky1) June 3, 2022
Umran Malik Has A New Target 🎯#Cricket #IPL2022 #SRH #UmranMalik #TeamIndia #IndianCricket pic.twitter.com/NhWKs0RXfK
— CRICKETNMORE (@cricketnmore) June 5, 2022