శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ గెలిచింది. నరాలు తెగే ఉత్కంఠతతో సాగిన ఈ మ్యాచ్ టీమిండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా యంగ్ బౌలర్లు తమ సత్తా ఏంటో లంకకు రుచిచూపించారు. శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ లు అయితే నిప్పులు చెరిగే బంతులతో లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఇక హోరా హోరిగా సాగిన ఈ మ్యాచ్ విన్నర్ ఎవరు అంటే ఉమ్రాన్ మాలిక్ అనే చెప్పాలి. అద్భుతమైన బౌలింగ్ తో ఈ మ్యాచ్ లో టీమిండియాను గెలిపించాడు మాలిక్. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ బౌలర్ బూమ్రా రికార్డును బద్దలు కొట్టాడు ఉమ్రాన్ మాలిక్.
“అన్ని అనుకున్నట్లుగా జరిగితే శ్రీలంకతో జరిగే సిరీస్ లో షోయబ్ అక్తర్ రికార్డ్ బద్దలు కొడతా” అని లంకతో మ్యాచ్ కు ముందే చెప్పాడు టీమిండియా స్పీడ్ గన్ కశ్మిరీ పేసర్ ఉమ్రాన్ మాలిక్. జమ్మూ ఎక్స్ ప్రెస్ గా పేరుగాంచిన ఉమ్రాన్ మాలిక్.. తాజాగా లంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు ఇంతకు ముందు బూమ్రా పేరిట ఉండేది. బూమ్రా గతంలో గంటకు 153.36 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. అయితే బూమ్రా కంటే ముందే 153.7 కిలోమీటర్ల స్పీడ్ తో బాల్ విసిరాడు టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. ఈ రికార్డును ఇప్పుడు ఉమ్రాన్ బద్దలు కొట్టాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఉమ్రాన్ వేసిన ఈ అత్యంత వేగవంతమైన బంతికే లంక కెప్టెన్ దసున్ షణక అవుట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన ఉమ్రాన్ 27 పరుగులు ఇచ్చి 2 కీలకమైన వికెట్లను తీశాడు.
Pace sensation Umran Malik clocks 155 kmph, becomes fastest Indian bowler
Read @ANI Story | https://t.co/K5tTvLQwnc#UmranMalik #T20I #Bowler pic.twitter.com/U3pbgMPQPq
— ANI Digital (@ani_digital) January 4, 2023
ఈ స్పీడ్ బాల్ రేసులో అగ్రస్థానంలో ఉమ్రాన్ మాలిక్ ఉంటే, 2వ స్థానంలో బూమ్రా, 153.3 కిలోమీటర్ల స్పీడ్ తో మహమ్మద్ షమీ మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 152.85 స్పీడ్ తో బంతి వేసి నవదీప్ సైనీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. గతంలో అక్తర్ సైతం తన ఫాస్టెస్ట్ బాల్ రికార్డును బద్దలు కొట్టే సత్తా ఉమ్రాన్ మాలిక్ కే ఉందని పేర్కొనడం విశేషం. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేయడమే కాకుండా.. స్పీడ్ ను మెయింటెన్ చేయడంతో మాలిక్ పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నా మాజీ ఆటగాళ్లు. అదీకాక ఉమ్రాన్ భవిష్యత్ భారత జట్టుకు కీలకంగా మారతాడు అని వారు కితాబిస్తున్నారు. అయితే బూమ్రా కంటే ముందే 153.7 కిలోమీటర్ల స్పీడ్ తో బాల్ విసిరాడు టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. దాంతో ఈ రికార్డు కూడా ప్రస్తుతం తుడుచుకుపోయింది. పఠాన్ సైతం ఉమ్రాన్ మాలిక్ పై ప్రశంసలు కురింపించాడు. టీమిండియాకు దొరికిన గొప్ప బౌలర్ ఉమ్రాన్ అని కితాబిచ్చాడు.
Umran Malik yesterday bowled the fastest ball by an Indian in International cricket history.#UmranMalik #IndianCricket #INDvsSL #IrfanPathan #JaspritBumrah #SkyExch pic.twitter.com/kfKxTqgzYa
— SkyExch (@officialskyexch) January 4, 2023