ఇండియన్ క్రికెట్‌లోకి ఒక మిస్సైలా దూసుకొచ్చాడు జమ్ము ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్. తన వేగంతో ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించిన ఉమ్రాన్.. టీమిండియా తరఫున అత్యంత వేగంవంతమైన బౌలింగ్ వేసిన బౌలర్‌గా నలిచాడు. ప్రపంచంలో ఏ బ్యాటర్ అయినా ఆడేందుకు భయపెడే పేస్‌తో బౌలింగ్ వేసే ఉమ్రాన్.. తనకు సహజసిద్ధంగా వచ్చిన ఈ టాలెంట్‌తో టీమిండియాకు ఒక వజ్రాయుధంగా మారగలడు. అందుకే టీమ్ మేనేజ్‌మెంట్ ఉమ్రాన్ బ్యాక్ చేస్తోంది. అతన్ని సరిగ్గా వాడుకుంటే.. టీమిండియాకు తిరుగుండదు. రెండువైపులా పదునుండే కత్తి లాంటి ఉమ్రాన్ పేస్.. అతని మెరుపువేగం జట్టుకు ఎంత మేలు చేస్తుందో.. ఒక్కొసారి అంతే చేటు కూడా చేస్తుంది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఉమ్రాన్‌ను మరింత సానపడుతున్నాడు. అందుకే రోజురోజుకు మరింత కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో ఉమ్రాన్ రెచ్చిపోతున్నాడు.
బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టీ20లోనూ ఉమ్రాన్ మాలిక్ తన పేస్‌తో ప్రత్యర్థిని వణికించాడు. వన్డే సిరీస్‌లో అద్భుతమైన సెంచరీతో భీకర ఫామ్‌లో ఉన్న కివీస్ బ్యాటర్ మిచెల్ బ్రెస్‌వెల్‌ను తన వేగంతో బోల్తా కొట్టించాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 150 స్పీడ్‌తో ఖంగుతిన్న బ్రెస్‌వెల్.. వికెట్ సమర్పించుకున్నాడు. బ్రెస్‌వెల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించే లోపే బాల్ వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఉమ్రాన్ స్పీడ్ ముందు బ్రెస్‌వెల్ బ్యాట్ స్వింగ్ వేగం సరిపోలేదు. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో బ్రెస్‌వెల్ తొలి రెండు బంతులకు పరుగుల చేయలేదు. ఇక మూడో బంతిని మరింత వేగంగా వేసిన ఉమ్రాన్.. బ్రెస్‌వెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్లియర్‌గా ఉమ్రాన్ స్పీడ్‌కు బీటైన బ్రెస్‌వెల్ బౌల్డ్ అయ్యాడు. అయితే.. ఉమ్రాన్ వేసిన బాల్ వికెట్లకు పైభాగంలో తగలడంతో.. స్టంప్స్‌పైనుండే బెయిల్స్ వికెట్ కీపర్ తలపైనుంచి ఎగిరివెళ్లి.. బౌండరీ లైన్ దగ్గర్లో పడ్డాయి. ఆ బెయిల్స్ వెళ్లి పడిన తీరు చూస్తూ.. ఉమ్రాన్ స్పీడ్ ఏంటో అర్థం అవుతుంది. ఆ బాల్‌ను ఉమ్రాన్ గంటకు 150 కిలో మీటర్ల వేగంతో సంధించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో 2.1 ఓవర్లు వేసిన ఉమ్రాన్ మాలిక్ కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్ కావడంతో రెండో మ్యాచ్‌లో ఉమ్రాన్‌కు చోటు దక్కలేదు. కానీ.. తిరిగి చివరిదైన మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఉమ్రాన్ తన పేస్‌తో ఆకట్టుకున్నాడు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్(126 నాటౌట్) సెంచరీతో కదం తొక్కగా.. రాహుల్ త్రిపాఠి 44, పాండ్యా 30 పరుగులతో రాణించారు. 235 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించేందకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను భారత పేసర్లు వణికించారు. తొలుత పాండ్యా ఆలెన్‌ను అవుట్ చేసి.. కివీస్ పతనాన్ని ఆరంభించగా.. ఆ తర్వాత అర్షదీప్‌సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావీ రెండేసి వికెట్లతో న్యూజిలాండ్ పనిపట్టారు. పాండ్యా 4 వికెట్లు తీసుకోగా.. న్యూజిలాండ్ 66 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అంతకు ముందు మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శన ముఖ్యంగా బ్రెస్‌వెల్‌ను అవుట్ చేసిన డెలవరీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Umran Malik comes into the attack and Michael Bracewell is bowled for 8 runs.
A beauty of a delivery from Umran 💥
Live – https://t.co/1uCKYafzzD #INDvNZ @mastercardindia pic.twitter.com/nfCaYVch4b
— BCCI (@BCCI) February 1, 2023