ఈ మధ్య క్రికెటర్లు ఆలయాలను సందర్శించి, పూజల్లో పాల్గొనడం తరచుగా జరుగుతోంది. ఒక నెలలోనే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పవిత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపారు. ఇప్పుడు ఉమేష్ యాదవ్ సైతం..
టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్ తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గత మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి, శివపూజలో పాల్గొన్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఉమేష్ యాదవ్ మహాకాళేశ్వరాలయంలోని జ్యోతిర్లింగానికి పూజలు చేయడం ప్రాధాన్యతను సంతరించకుంది. ఇప్పటికే ఈ ఆలయాన్ని టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ దంపతులు, కేఎల్ రాహుల్ దంపతులు సందర్శించి శివపూజలో పాల్గొన్నారు. ఇప్పుడు ఉమేష్ యాదవ్ కూడా ఆ లిస్ట్‌లో చేరారు. కాగా.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఆటలో మంచి ప్రదర్శన చేయడం విశేషం.
అయితే.. వారి సక్సెస్ వెనుక శివుడి దీవెనలు ఉన్నాయని, అందుకే ఫామ్‌లో లేని వారు దర్శనం తర్వాత ఫామ్‌లోకి వస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో ఉమేష్ యాదవ్ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించడం ప్రాధాన్యతను సంతరించకుంది. ఐపీఎల్‌తో పాటు దాని తర్వాత జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో మంచి ప్రదర్శన చేయాలనే ఉద్దేశంతోనే ఉమేష్ యాదవ్ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. అయితే.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కంటే ముందే మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సైతం మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించినప్పటికీ అతను బ్యాడ్ ఫామ్‌లోనూ కొనసాగుతున్నాడు. మరి ఉమేష్ జోతిర్లింగాన్ని దర్శించి, పూజలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Indian Cricketer Umesh Yadav offers prayers at Mahakaleshwar Temple in Ujjain pic.twitter.com/g4ncqFlESi
— Take One (@takeonedigital) March 20, 2023