ఇంగ్లాండ్ లోని లండన్ వేదికగా.. మరి కాసేపట్లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగబోతుంది. ఆస్ట్రేలియా, భారత్ తలపడబోయే ఈ మ్యాచు కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. ఈ మ్యాచ్ ఎవరు గెలిచినా ఐసీసీ టోర్నీలు అన్ని గెలిచిన టీంగా చరిత్ర సృష్టిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య తుది పోరు హోరా హోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తుంది. అంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు ఈ మ్యాచ్ కి ఒక అనుకోని ముప్పు ఒకటి ఎదురు కానుందని సమాచారం. ఈ కారణంగానే ఈ ఫైనల్ కోసం రెండు పిచ్ లు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ ఫైనల్ కి ముంచి ఉన్న ఆ ముప్పు ఏంటో ఇప్పుడు చూద్దాం.
డబ్ల్యూటీసీ ఫైనల్ కి వర్షం రూపంలో ఒక ప్రమాదం పొంచి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్ కి రిజర్వ్ డే ఉండడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు ఊహించని ఒక సంఘటన ఒకటి ఎదురు అయ్యే అవకాశం ఉంది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం బ్రిటన్‌లో ఇంధన సంస్థలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ వేదికను ధ్వంసం చేయనున్నట్లు ఇప్పటికే ఆ నిరసనకారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా పిచ్ కూడా దెబ్బతీయనున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. కెన్నింగ్టన్ ఓవల్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఫైనల్ కోసం రెండు పిచ్‌లను సిద్ధంగా ఉంచింది. ఐసీసీ నిబంధనల మేరకే ఆ పిచ్‌లను రెడీ చేసినట్లు చెప్పింది.
గ్రౌండ్ వద్ద సెక్యూర్టీని కూడా పెంచినట్లు ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ సెక్షన్ 6.4 రూల్ ప్రకారం .. బ్యాకప్ పిచ్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్ జరిగే పిచ్ దెబ్బతింటే అప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేసి ఆ తర్వాత మరో పిచ్‌ను వాడాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోనున్నారు. రెండు పిచ్‌ల రూల్ గురించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కు తెలియజేశారు. ఒకవేళ ఇద్దరు కెప్టెన్లు రెండో పిచ్‌పై ఆడేందుకు అంగీకరిస్తే అప్పుడు మ్యాచ్ కొనసాగుతుంది, లేదంటే రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందో లేకపోతే రద్దవుతుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Decisions, decisions 🤔
Australia skipper Pat Cummins has been studying the wicket ahead of the #WTC23 Final. pic.twitter.com/DueWq4QGxX
— ICC (@ICC) June 6, 2023