ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల్లో కెప్టెన్ శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన శుభ్‌మన్ గిల్ మంచి ప్రదర్శన కనబర్చాడు. తొలి మ్యాచ్‌లో 64, రెండో వన్డేలో 43 పరుగులు చేసిన గిల్ మూడో వన్డేలో 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వర్షం అంతరాయం కలిగించడంతో సెంచరీ మిస్ అయింది.
తొలి రెండు వన్డేల్లో వికెట్‌ను చేజేతులా పారేసుకున్నాడనే విమర్శలు ఎదుర్కొన్న గిల్.. మూడో వన్డేలో అలాంటి తప్పిదాలు చేయకుండా సెంచరీ దిశగా సాగాడు. సెంచరీకి రెండు పరుగుల దూరంలో వర్షం వచ్చింది.. ఈ విషయంలో ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ టీమ్ ట్విట్టర్‌లో కొంచెం ముందే స్పందించింది. శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసేశాడని ట్విట్ వదిలింది.
కానీ.. 98 పరుగుల వద్ద వర్షం వచ్చి.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్ బ్యాటింగ్ చేయాల్సి రావడంతో గిల్‌కు నిరాశే మిగిలింది. ఆ టైమ్‌లో ఆర్సీబీ ట్వీట్ చూసిన క్రికెట్ అభిమానులు దాన్ని స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ ట్వీట్‌ను కొద్ది సేపటి తర్వాత ఆర్సీబీ డిలీట్ చేసినా.. నెటిజన్లు మాత్రం ట్రోల్ చేస్తునే ఉన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
RCB mistakenly congratulates Shubman Gill for maiden century, later deletes the tweet. https://t.co/5uYjBD1QYL
— CricTracker (@Cricketracker) July 28, 2022
Jinxed: Shubman Gill ‘100’ as per RCB @RCBTweets #IndvsWI #CricketTwitter #Shubmangill pic.twitter.com/8ej4KTy9ch
— BlrBoy (@Blrboy2021) July 27, 2022
Haha..#RCB handle got too excited .#ShubmanGill #IndvsWI #WivInd #IndvWi pic.twitter.com/kTpJDHuNFt
— movieman (@movieman777) July 27, 2022