తెలుగు క్రికెటర్ కోన శ్రీకర్ భరత్‌పై సోషల్ మీడియలో దాడి జరుగుతోంది. ఆస్ట్రేలియాపై మూడు టెస్టుల్లో విఫలం అయ్యాడంటూ భరత్‌ను ట్రోల్ చేస్తున్నవారు, వాళ్లని సపోర్ట్ చేస్తున్న వాళ్లు ఈ విషయం తెలుసుకోండి..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023తో టీమిండియా తరఫున టెస్టు క్రికెట్‌లోకి తెలుగు కుర్రాడు, యువ క్రికెటర్ కేఎస్ భరత్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు టెస్టుల్లోనూ భరత్‌కు తుది జట్టులో చోటు దక్కింది. అయితే.. బ్యాటింగ్‌లో కేఎస్ భరత్ అంతగా రాణించలేదు. దీంతో భరత్‌పై సోషల్ మీడియా వేదికగా దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. కొంతమంది పనిగట్టుకుని భరత్‌పై ట్రోలింగ్‌కి దిగుతున్నారు. ‘భరత్ జట్టులో ఉండటం వేస్ట్ అని, అతన్ని ఎలా సెలెక్టర్ చేశారంటూ’ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. అయితే ఈ ట్రోలింగ్ చేస్తున్నవారంతా సిరీస్ ఎలా సాగుతుందో గమనించడం లేదన్నట్లు ఉంది. కేవలం.. యువ క్రికెటర్ అయిన కారణంగానే భరత్‌పై ట్రోల్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరాలనే లక్ష్యంతో టీమిండియా ఈ సిరీస్‌లో బరిలోకి దిగింది. అందుకోసం పట్టబట్టి మరీ ఫుల్ స్పిన్ పిచ్‌లను, ఫస్ట్ డే నుంచే టర్న్ లభించే పిచ్‌లను తయారు చేయించుకుని మరీ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి రెండు టెస్టుల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. కానీ, మూడో టెస్టుకు వచ్చేసరికి మొదట బ్యాటింగ్ చేయడం టీమిండియా కొంపముంచింది. లేదంటే.. మూడో టెస్టులోనూ ఫలితం వేరేలా ఉండేది. మ్యాచ్‌ల సంగతి పక్కనపెడితే.. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది స్పిన్ పిచ్ గురించి.. ఒక ప్రత్యేక లక్ష్యంతో టీమిండియా స్పిన్ పిచ్‌లను కోరుకుంటుంది. ఇలాంటి పిచ్‌లపై స్పిన్‌ను అంత సమర్థవంతంగా ఆడలేని ఆస్ట్రేలియా ఆటగాళ్లు తడబడతారని వారి నమ్మకం.
కానీ కొన్ని సార్లు అదే రివర్స్ అయి మన బ్యాటింగ్ లైనప్‌పై కూడా ప్రభావం చూపొచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో కూడా నాథన్ లయన్‌తో పాటు టాడ్ మర్ఫీ, కుహ్నేమన్ లాంటి ఇద్దరు యువ టాలెంటెడ్ స్పిన్నర్లు ఉన్నారు. మూడో టెస్టులో జరిగింది అదే. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆసీస్ బౌలర్లు చెలరేగిపోయారు. వారి ముందు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, పుజారా, శ్రేయస్ అయ్యర్, జడేజా, శుబ్‌మన్ గిల్ లాంటి హేమాహేమీ ఆటగాళ్లే నిలబడలేకపోయారు. అలాంటప్పుడు ఒక యువ క్రికెటర్‌ను పట్టుకుని బ్యాటింగ్‌లో విఫలం అయ్యాడంటూ ట్రోల్ చేయడం ఎంత వరకు సమంజసం. భరత్ ఒక్కడే కాదు.. టీమిండియా బ్యాటింగ్ లైనప్ మొత్తం విఫలమైంది. ఈ సిరీస్‌లో కోహ్లీ, కేఎల్ రాహుల్, గిల్, శ్రేయస్ అయ్యర్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో కావాల్సినంత అనుభవం ఉండి, టన్నుల కొద్ది పరుగులు చేసిన ఆటగాళ్లే విఫలమైన పిచ్‌పై ఓ యువ క్రికెటర్‌ను నుంచి పరుగులు ఆశించడం అత్యాశే అవుతుంది.
అప్పటికీ కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా తన వంతు పాత్రను సమర్థవంతగానే పోషించాడు. గింగిరాలు తిరుగుతున్న బంతులను రెప్పపాటు వేగంతో పట్టుకుంటూ బౌలర్లకు మద్దతుగా నిలిచాడు. వికెట్ల వెనుక ఉంటూ.. రివ్యూలో తీసుకోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మకు బెస్ట్ అడ్వైజర్‌గా ఉన్నాడు. కొమ్ములు తిరిగిన ఆటగాళ్లు నిలవలేకపోయిన పిచ్‌పై భరత్ విఫలమవ్వడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. ఒక అరంగేట్రం ప్లేయర్‌కు ఇలాంటి పిచ్‌లపై ఆడటం అగ్నిపరీక్ష కంటే ఎక్కువే. అయితే ఒక తెలుగు క్రికెటర్ కావడంతోనే భరత్‌పై ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారనే వాదనలు కూడా క్రికెట్ అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో అంబటి రాయుడికి కూడా ఇలానే అన్యాయం చేశారంటూ తెలుగు క్రికెట్ ఫ్యాన్స్. తనకు వచ్చిన తక్కువ అవకాశాల్లోనే అద్భుతంగా రాణించిన రాయుడికి.. 2019 వరన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ, రాయుడిని వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయకుండా అన్యాయం చేయడంతో అక్కడితో రాయుడి కెరీర్‌కు పుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత ఐపీఎల్‌లో రాయుడు ఎలాంటి అద్భుత ప్రదర్శనలు చేశాడో, అతని ప్లేస్‌లో వరల్డ్ కప్‌కు పంపిన ఆటగాడు ఎంత దారుణంగా విఫలం అయ్యాడో అందరికి తెలిసిందే.
ఇప్పుడు కూడా కేవలం 3 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిపై ఇంత దారుణంగా ట్రోలింగ్‌కు దిగి, అతని కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టే కుట్ర జరుగతోందంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తెలుగు క్రికెటర్ అయిన పాపానికి కేఎస్ భరత్ సైతం మరో రాయుడిలా అయిపోతాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా భరత్ ఏమైనా అల్లాటప్పా ప్లేయర్ కాదు. దేశవాళ్లీ క్రికెట్‌లో సత్తా చాటి జాతీయ జట్టులోకి వచ్చిన ఆటగాడు. 89 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 4764 పరుగులు ఒక ట్రిపుల్ సెంచరీ, 9 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు భరత్ ఖాతాలో ఉన్నాయి. అలాగే లిస్ట్ ఏ క్రికెట్‌లో 64 మ్యాచ్‌ల్లో 1950 రన్స్ 6 సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు బాదేడు. అలాంటి ప్లేయర్‌ను కేవలం రెండు, మూడు టెస్టుల్లో విఫలమైనంత మాత్రానా ఇంతల ట్రోల్ చేయడం సరి కాదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KS Bharat will be selected again for the 4th test bec no one can jump more than him from behind the stumps#INDvsAUSTest pic.twitter.com/naK3tL9pxF
— Ragaa (@Ragaa_07) March 3, 2023
Wriddiman Saha was far better option than this fraud KS Bharat. pic.twitter.com/3uz0LYBJmr
— supremo ` (@hyperKohli) March 2, 2023
KS Bharat 😒#IndvsAus pic.twitter.com/HDOXUXh53k
— RADHE ࿗🚬🇮🇳 (@Iamradhe_p00) March 2, 2023