క్రికెట్‌లో బ్యాటర్లు, బౌలర్లే కాదు.. కొన్నిసార్లు ఫీల్డర్లు కూడా మ్యాచ్ టర్నింగ్ అద్భుతాలు విన్యాసాలు చేస్తుంటారు. తమ ఫీల్డింగ్ ఎఫర్ట్స్‌తో పరుగులను ఆపుతూ.. క్యాచ్‌లు తీసుకుంటూ విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటారు. కొన్నిసార్లు కొన్ని క్యాచ్‌లు అద్భుతంగా అనిపిస్తాయి. ‘వావ్.. భలే పట్టాడు’‘ఏం పట్టాడు రా క్యాచ్’ అంటూ క్రికెట్ అభిమానులు చర్చించుకుంటారు. మరికొన్ని సార్లు కొన్ని క్యాచ్‌లు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలుస్తాయి.
కానీ.. తాజా సౌతాఫ్రికా క్రికెటర్ ట్రిస్టన్ స్టబ్స్ పట్టిన ఒక క్యాచ్ మాత్రం.. ఇప్పటి వరకు జరిగిన అన్నీ మ్యాచ్‌లకు హైలెట్‌గా నిలిచేలా ఉంది. ఫిక‌్షన్ సినిమాల్లో సూపర్‌మ్యాన్ గాల్లోకి ఎగిరినట్లు.. పూర్తిగా గాల్లో అడ్డంగా తేలుతూ క్యాచ్ పట్టుకున్నాడు. ఈ క్యాచ్‌ను ఒకసారి కాదు రెండుసార్లు కాదు.. ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది. మీడియా భాషలో తరచుగా కళ్లు చెదిరే క్యాచ్ అనే పదం వాడుతుంటారు.. నిజానికి ఇది కళ్లు చెదిరే క్యాచ్ కాదు.. చూసేవాళ్ల ఒళ్లు అదిరే క్యాచ్‌లా ఉంది.
ప్రస్తుతం స్టబ్స్ పట్టిన ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు స్టబ్స్ మనిషేనా.. లేక క్రికెట్‌లో సూపర్ మ్యానా అంటూ నెటిజన్లు సరదాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను పట్టిన క్యాచ్ అలా ఉంది మరి. ఇక ఈ అత్యద్భుతమైన క్యాచ్ ఆదివారం సౌతాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ చివరి బంతిని మార్కరమ్ ఫ్లాటర్ డెలివరీగా వేస్తాడు. ఈ బాల్‌ను ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ బ్యాట్ ఫేస్ క్లోజ్ చేసి లీడింగ్ ఎడ్జ్ కోసం ఆడతాడు కానీ.. బంతి గాల్లోకి షార్టర్ మిడ్ ఆఫ్ వైపు వెళ్తుంది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ట్రిస్టన్ స్టబ్స్ అమాంతం గాల్లోకి లేస్తూ.. సూపర్‌మ్యాన్‌లా క్యాచ్ అందుకుంటారు.
ఈ అద్భుతమైన క్యాచ్‌కు సౌతాఫ్రికా ఆటగాళ్లు స్టబ్స్‌ను అభినందనలతో ముంచెత్తుతారు. ఇక ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 90 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి ప్రొటీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బదులుగా ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అని ఘోర ఓటమిని మూటగట్టుకుంది. మరి ఈ మ్యాచ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ పట్టిన క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Tristan Stubbs – the Superman! pic.twitter.com/XNT8wWIbSh
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 31, 2022
ఇది కూడా చదవండి: ఇంగ్లండ్‌పై స్టబ్స్ సిక్సర్ల వర్షం! ఇలాంటి ప్లేయర్‌కా ముంబై ఛాన్సులు ఇవ్వంది?