బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో ఇంగ్లండ్-సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లు జానీ బెయిర్‌స్టో(90), మొయిన్ అలీ(52) పరుగులతో చెలరేగడంతో ఇంగ్లండ్ భారీ టార్గెట్‌ను ప్రొటీస్ ముందు ఉంచింది. ఈ భారీ స్కోర్ ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా ఆరంభంలో తడబడింది.
ఇంగ్లండ్ బౌలర్ టాప్లీ దెబ్బకు ఓపెనర్ క్వింటన్ డికాక్(2), రిలీ రోసోవ్(4) ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు. రెండో బంతికి డికాక్.. మలాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా, అదే ఓవర్ చివరి బంతికి రోసోవ్ గ్లీసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ తర్వాత హెన్రిచ్ క్లాసెన్(20), ఓపెనర్ రీజ్ హెండ్రిక్స్(57) అవుట్ అయ్యారు. క్రీజ్‌లో కెప్టెన్ మిల్లర్ ఉన్నాడు. జట్టు స్కోర్ 4 వికెట్లకు 86 పరుగులు మాత్రమే.
దీంతో సౌతాఫ్రికా పోరాటం ఎక్కువసేపు సాగదు అనే అంచనాకు వచ్చేశారు ఇంగ్లండ్ బౌలర్లు. కానీ.. క్రీజ్‌లోకి వచ్చిన 21 ఏళ్ల కుర్రాడు ట్రిస్టన్ స్టబ్స్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. సౌతాఫ్రికాను విజయం దిశగా నడిపించాడు. ఈ క్రమంలోనే కేవలం 19 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. 28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 72 పరుగులు చేసిన స్టబ్స్ చివరికి 19వ ఓవర్ తొలి బతికి రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్‌లో లాంగ్ ఆఫ్‌లో భారీ షాట్ ఆడబోయి జాసన్ రాయ్ చేతికి చిక్కుతాడు. ఇక్కడితో స్టబ్స్ తుపాన్ ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడుతుంది. అప్పటి వరకు స్టబ్స్ బ్యాటింగ్‌కు వణికిపోయిన ఇంగ్లండ్ బౌలర్లు ఊపిరి పీల్చుకుంటారు. స్టబ్స్ నిష్క్రమణతో సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌ను 41 పరుగులతో తేడాతో ఓడిపోతుంది. కాగా.. సౌతాఫ్రికా మ్యాచ్ ఓడినా.. స్టబ్స్ ఆడిన ఇన్నింగ్స్‌పై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తుంది.
ఇలాంటి ప్లేయర్‌కు అవకాశాలు ఇవ్వని ముంబై ఇండియన్స్..!
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు టైమల్ మిల్స్ గాయపడటంతో అతని స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్‌ను ముంబై ఇండియన్స్ తీసుకుంటుంది. కానీ అతనికి పెద్దగా అవకాశాలు ఇవ్వదు. మరో సౌతాఫ్రికా అన్‌క్యాప్డ్ ప్లేయర్ అయిన బ్రెవిస్‌కు మాత్రం అనేక అవకాశాలు ఇచ్చింది. కాగా రెండు మ్యాచ్‌ల్లో ఆడిన ట్రిస్టన్ స్టబ్స్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
కానీ.. ఇప్పుడు ఇంగ్లండ్‌పై ఆడిన ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ఇలాంటి ఆటగాడికి ముంబై ఎందుకు ఛాన్సులు ఇవ్వలేదంటూ కొంతమంది ముంబై ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కాగా ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. మరి ట్రిస్టన్ స్టబ్స్ ప్రదర్శనపై, ముంబై అభిమానుల ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Tristan Stubbs, what a way to announce yourself on the international stage! 🙌 #ENGvSA pic.twitter.com/hT4s71cswm
— ESPNcricinfo (@ESPNcricinfo) July 27, 2022
Tristan Stubbs!#ENGvSA pic.twitter.com/UK8Mc1eUhe
— RVCJ Media (@RVCJ_FB) July 28, 2022
Tristan Stubbs Knock of 72(28) Highlights 👇👇#SAvENG #ENGvSA #Cricket #CricketTwitter #SA #ENG #SSCricket #Stubbs #T20 pic.twitter.com/lShoGyAIVP
— The Cricket Guy 27 (@TheCricketGuy27) July 28, 2022