మ్యాచ్ గెలిచేందుకు లాస్ట్ బాల్‌కు 6 పరుగులు కావాలి. అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోయి.. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. క్రీజ్‌లో బంతితో అద్భుతాలు చేసే న్యూజిలాండ్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. గెలుపు దాదాపు అసాధ్యంగా మారింది. ఎవరికీ మ్యాచ్‌పై ఆశలు లేవు. కానీ ఆ చివరి బంతికి నిజంగానే అద్భుతం జరిగింది. బుల్లెట్‌లా బంతి దూసుకోస్తుండగా.. అంతే వేగంగా బ్యాట్‌ను ఝళిపించాడు బౌల్ట్. దెబ్బకు అంతా నోరెల్లబెట్టారు. ఎందుకంటే బాల్ పోయి బౌండరీ అవతల పడింది. దీంతో ఫీల్డింగ్ టీమ్ కళ్లు బైర్లు కమ్మాయి. బ్యాటింగ్ జట్టు బౌల్ట్ ఇచ్చిన షాక్‌కు పట్టరాని ఆనందంతో గంతులేశారు.
TRENT BOULT!!
Needed 6 runs off the final ball and he delivered!#SparkSport #SuperSmashNZ@ndcricket @supersmashnz pic.twitter.com/GhiSy8DmPf— Spark Sport (@sparknzsport) December 23, 2021
ఈ థ్రిల్లింగ్ విక్టరీ.. న్యూజిలాండ్‌లో జరుగుతున్న సూపర్ స్మాష్ ఈవెంట్‌లో చోటుచేసుకుంది. నార్తర్న్ నైట్స్, కాంటర్బరీ మధ్య జరిగిన మ్యాచ్‌లో నార్తర్న్ నైట్స్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కాంటర్బరీ 17.2 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన నార్తర్న్ నైట్స్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి.. లాస్ట్ బాల్‌కు బౌల్ట్ సూపర్ సిక్స్‌తో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మరి బౌల్ట్ సిక్సర్‌తో మ్యాచ్ గెలిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Trent Boult on the mic 🎙 after hitting a SIX off the final ball to win it for the Northern Brave.#SparkSport #SuperSmashNZ@ndcricket @SuperSmashNZ pic.twitter.com/wAwJby3imQ
— Spark Sport (@sparknzsport) December 23, 2021