టోక్యో ఒలింపిక్స్ లో భాగంగా తొలి పతాకం భారత్ దరి చేరింది. ఇక వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరా బాయి చానుకు సిల్వర్ మెడల్ వచ్చింది. ఇక 49 కేజీల విభాగంలో భాగంగా బాయి చాను రజత పతాకాన్ని సాధించి బోణి కొట్టింది. స్నాచ్ లో 87 కిలోలు ఎత్తిన చాను క్లిన్ అండ్ జర్క్ లో 115 ఎత్తింది.
దీంతో పాటు 202 కేజీల బరువును ఎత్తి రజత పతాకాన్ని ఇండియాకు అందించి మీరా బాయి చాను. దీంతో అమేకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఇక ఈ సారి టోక్యో వేడుకలను జపాన్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. లేజర్ తళుకుల మధ్య భారత కాలమానం ప్రకారం ఈ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యాయి.
దీంతో ప్రధాని మోడీ భారత అథ్లెటిక్స్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇండియా నుంచి మాత్రం 20 మంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. దీంతో పాటు 2020లోనే జరగాల్సిన ఈ క్రీడలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఎట్టకేలకు జపాన్ ప్రభుత్వం కరోనాపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ క్రీడలను ప్రారంబిస్తోంది. అయితే మరో విషయం ఏంటంటే..అనుకున్న సమయానికి ప్రారంభిస్తున్నా..కొన్ని కరోనా కేసులు నమోదవడం విశేషం.