టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఒక పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తెలుగు యువ క్రికెటర్‌ను టీమిండియా భవిష్యత్తుగా పేర్కొన్నాడు. జడేజాను నుంచి అంత పెద్ద స్టేట్‌మెంట్ అందుకున్న ఆ యువ ఆటగాడు ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరు మర తిలక్ వర్మ. హైదరాబాద్‌కు చెందిన నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ దుమ్ములేపుతున్న తిలక్ వర్మ ఇక టీమిండియాకు ఆడటమే మిగిలుంది. అలాగే దేశవాళీ క్రికెట్‌లోనూ తిలక్ వర్మ తన ప్రతిభ చూపిస్తున్నాడు. తాజాగా ఈ యువ క్రికెటర్.. టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజాతో కలిసి ఫొటో దిగాడు. ఆ ఫొటోను జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేస్తూ.. ‘చిల్లింగ్ విత్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ అంటూ పేర్కొన్నాడు. జడేజా చేసిన ఈ పోస్టులో రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న జడేజా లాంటి ఆటగాడు ఒక యువ క్రికెటర్ గురించి ఇలా పేర్కొనడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ.. టీమ్ మొత్తం విఫలమైనా అతనొక్కడే రాణించాడు. మొత్తం 14 మ్యాచ్ ఇన్నింగ్స్‌ల్లో 397 రన్స్ చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి. అలాగే అతని టాప్ స్కోర్ 61. ఇక దేశవాళీ క్రికెట్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 7 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తిలక్‌వర్మ 11 ఇన్నింగ్స్‌ల్లో 409 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే 25 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 1236 రన్స్ చేశాడు. అందులో 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక దేశవాళీ టీ20 మ్యాచ్‌ల్లో 36 మ్యాచ్‌లు ఆడి 1075 పరుగులు చేశాడు. అందులో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇలాంటి నిలకడైన ప్రరద్శన చూపిస్తున్న తిలక్ వర్మ ఇలాగే మరో ఏడాది ఆడితే.. భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే జడేజా సైతం తిలక్ టాలెంట్‌ను గుర్తించి పై విధంగా పేర్కొన్నాడు.
ఇక చాలా రోజులుగా టీమిండియాకు దూరంగా ఉన్న జడేజా ఆస్ట్రేలియాతో ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం, సర్జరీ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022కు దూరమైన జడేజా.. ఆ తర్వాత పలు సిరీస్‌లకు సైతం దూరంగానే ఉన్నాడు. కానీ.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి కీలక ఆటగాడైన జడేజాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అంతకంటే ముందు కనీసం ఒక రంజీ మ్యాచ్ ఆడాలని జడేజాకు కండీషన్ పెట్టారు. సెలెక్టరు పెట్టిన కండీషన్ ప్రకారం ఒక మ్యాచ్ ఆడిన జడేజా.. ఏకంగా 8 వికెట్లతో సత్తా చాటాడు. ఒక ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల పడగొట్టాడు. దీంతో.. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించడంతో జడేజా ఆస్ట్రేలియాతో జరిగే.. తొలి టెస్టులో బరిలోకి దిగడం ఖాయమైంది. మరి జడేజా లాంటి స్టార్ ప్లేయర్ తిలక్ వర్మను భారత భవిష్యత్తుగా పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.