క్రికెట్ అభిమానులకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2024 నుంచి 2027 వరకు ఉమెన్స్ క్రికెట్‌లో ఐసీసీ మెగా ఈవెంట్లు జరిగే వేదికలను ప్రకటించింది. కాగా.. మొత్తం నాలుగు మెగా టోర్నీల్లో మూడు ఉపఖండంలోనే జరగనుండడం విశేషం. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 బంగ్లాదేశ్‌లో జరగనుంది. ఆ తర్వాత ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 భారత్.. 2027 ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది.
2026లో జరిగే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఇంగ్లండ్‌లో జరగనుంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో క్రికెట్‌ను విపరీతంగా అభిమానిస్తారనే విషయం తెలిసిందే. ఈ ఉపఖండపు దేశాల్లో ఏ మెగా టోర్నీ జరిగినా అది సూపర్ హిట్ అవుతుంది. పైగా అభిమానులకు కూడా స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడటం ఈజీ అవుతుంది. దీంతో ఇలా వరుసగా మూడేళ్లు మూడు ఐసీసీ మెగా టోర్నీలు భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకలో జరగనుండడం ప్రాధ్యానతను సంతరించకుంది.
అలాగే పురుషుల క్రికెట్‌కు సంబంధించి 2023-27 మధ్య జరిగే టోర్నీలను కూడా ఐసీసీ ఫైనల్ చేసింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. అలాగే ఐసీసీ చైర్మన్ పదవికి ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం జార్జ్ ఐసీసీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన స్థానంలో ఎన్నికైన వ్యక్తి 2024 వరకు పదవిలో కొనసాగనున్నారు. మరి మూడు ఐసీసీ టోర్నీలు ఉపఖండంలో జరగనుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Great news for cricket fans in Asia with three more World Cups confirmed across the next four years 🔥
Details ⬇️https://t.co/cNlSYfAyus
— ICC (@ICC) July 27, 2022