ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో వివాదం మొదలైంది. గబ్బా వేదికగా బుధవారం తొలి టెస్టు ప్రారంభమైంది. రెండో రోజైన గురువారం ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఏకంగా 14 నోబాల్స్ వేశాడు. అందులో కేవలం ఒకే ఒక దాన్ని మాత్రమే ఫీల్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. అది కూడా డేవిడ్ వార్నర్ ఔటైన సందర్భంగా.. థర్డ్ అంపైర్ రిప్లైని పరిశీలిస్తే అప్పుడు అది నోబాల్‌గా తేలింది. దాంతో ఆస్ట్రేలియా టీమ్‌కి నోబాల్స్ రూపంలో లభించాల్సిన 13 పరుగుల్ని నష్టపోయింది.
గురువారం మ్యాచ్ ప్రారంభానికి ముందు థర్డ్ అంపైర్ వద్ద ఉన్న నోబాల్‌ని పరిశీలించే పరికరం పగిలిపోయింది. అయినప్పటికీ.. మ్యాచ్‌ని కొనసాగించారు. కానీ.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనల ప్రకారం.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే టెస్టు మ్యాచ్‌ల్లో ప్రతి బంతినీ లీగల్ డెలివరీయా కాదా అనేది థర్డ్ అంపైర్ పరిశీలించాల్సి ఉంటుంది. కానీ.. పరికరం పగిలిపోవడంతో.. థర్డ్ అంపైర్ ఆ పని చేయలేకపోయాడు. దాంతో చాలా రోజుల తర్వాత మళ్లీ మ్యాచ్‌లు ఆడుతున్న బెన్‌స్టోక్స్ లయ అందుకునేలోపు చాలా నోబాల్స్ వేశాడు.
Ben Stokes’ first four deliveries of the over was No Ball, but umpire didn’t see. Only 4th one was given No Ball in which David Warner was out. pic.twitter.com/DYHNJ6QrRo
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 9, 2021