రికార్డులకు కూడా అతడంటే భయం.. అందుకే అతడికి వంగి సలామ్ కొట్టి.. గులామ్ అవుతాయి. ఇక ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించడం అతడికి వెన్నతోపెట్టిన విద్య. అదీ కాక అతడికి బౌలింగ్ చేయాలంటే ఏ బౌలర్ కైనా ఓ వైపు వణుకు పుట్టడం ఖాయం. అందుకే శత్రువులు సైతం అతడి ఆటకు అభిమానులుగా మారిపోతారు. ఇంతగా ఎలివేషన్ ఇస్తుంది ఎవరి గురించో.. ఈ పాటికే మీకు అర్దం అయ్యింది అనుకుంటా! అవును మీరనుకుంటున్న ఆ హీరో టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ గురించే ఈ ఎలివేషన్ అంతా. నవంబర్ 5 (శనివారం పుట్టినరోజు జరుపుకుంటున్న విరాట్ కోహ్లీపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ వరుసలో పాక్ క్రికెటర్లతో పాటు, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఉన్నారు. ప్రస్తుతం ట్వీటర్ లో ట్రెండింగ్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు.
Just couldn’t wait for 5th Nov to wish the artist who made cricket the most beautiful. Happy birthday @imVkohli the #GOAT𓃵. Enjoy your day brother & Keep entertaining the world. ❤️🎂. pic.twitter.com/601TfzWV3C
— Shahnawaz Dahani (@ShahnawazDahani) November 4, 2022
Happiest birthday to the definition of Mr. Perfectionist, the Brand and a MAN surrounded with Billion Indian hopes.. 💥💥 VEERAt Kohli ✨
Keep inspiring us KING @imVkohli 👍🏻#HappyBirthdayViratKohli pic.twitter.com/22lp6DyITk
— Gopichandh Malineni (@megopichand) November 5, 2022
టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ నవంబర్ 5వ తారిఖు తో 34 వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. దాంతో అతడి పుట్టిన రోజు సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దాంతో ట్వీటర్ కింగ్ కోహ్లీ పేరుతో మారు మ్రోగిపోతోంది. కోహ్లీ కి బర్త్ డే విషెస్ తెలిపిన వారిలో పాక్ పేసర్ షానవాజ్ దహానీ ముందువరుసలో ఉన్నాడు. ట్వీటర్ వేదికగా..”ప్రపంచ క్రికెట్ ను కళాత్మకమైన ఆటతో సుందరంగా తీర్చిదిద్దిన నీకు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా. నీకు విషెస్ చెప్పడానికి నవంబర్ 5 వరకు ఆగలేకపోతున్నా.. ప్రతీ రోజును ఆస్వాదిస్తూ ఈ వరల్డ్ ను అలరించండి” అంటూ దహాని రాసుకొచ్చాడు.
Dear @imVkohli,
Here is a very special wish from a very special friend. 🥳🥹#PlayBold #HappyBirthdayViratKohli @abdevilliers17 pic.twitter.com/UT7wEdnde2
— Royal Challengers Bangalore (@RCBTweets) November 5, 2022
ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తనదైన సినీ స్టైల్లో విరాట్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు. “ఫర్పెక్షనిస్టు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం.. కోట్ల మంది భారతీయులు ప్రేమాభిమానాలు, ఆశయాలు చుట్టు ముట్టబడిన కింగ్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు శుభాకాంక్షలు” అంటూ రాసుకురావడమే కాక తన అప్ కమింగ్ సినిమా వీరసింహారెడ్డి మూవీ పోస్టర్ లో విరాట్ ఫొటోతో ట్వీట్ చేశాడు. మరో డైరెక్టర్ బాబీ సైతం కోహ్లీకి బర్త్ డే విషెస్ చెప్పాడు. వీరితో పాటుగా IPL టీమ్స్ కోల్ కత్తా నైట్ రైడర్స్, బెంగళూర్ రాయల్ చాలెంజర్ కూడా కోహ్లీ కి బర్త్ డే విషెస్ తెలిపాయి. ప్రస్తుతం బెంగళూర్ లో ఉన్న దక్షిణాఫ్రికా స్టార డివిల్లియర్స్ విరాట్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్న వీడియోను ఆర్సీబీ విడుదల చేసింది. అందులో ”ఈ రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను. నువ్వు నాకు ప్రియమైన మిత్రుడవు. నీతో కలిసి ఆడటాన్ని ఆస్వాదిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే విరాట్” అంటూ ఏబీడి విషెస్ తెలిపాడు. టీమిండియా స్టార్ ఫినిషర్ దినేష్ కార్తీక్.. ”ఎవరూ నమ్మనప్పుడే నమ్మేది ఆయనే” హ్యాపీ బర్త్ డే కోహ్లీ అంటూ రాసుకొచ్చాడు. అదీకాక ప్రపంచ నలుమూలల నుంచి టీమిండియా రన్ మెషిన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
He’s the one who believes when no one else does!
A very happy birthday to you @imVkohli. pic.twitter.com/NtQh9zej6G— DK (@DineshKarthik) November 5, 2022
Today is the birthday of Virat Kohli sir, who inspired me. I pray to God that you keep scoring runs for such a country. and thank you very much for your support@imVkohli @vkfofficial
#ViratKohli #HappyBirthdayViratKohli #viratkohlibirthday pic.twitter.com/gHjQbsbElx— Pooja Bishnoi (@poojabishnoi36) November 5, 2022
Wishing the Pride of India, one of the greatest players from our country @imVkohli a very happy birthday. 💐
May God bless you with abundant happiness and success. ❤️#HappyBirthdayViratKohli pic.twitter.com/wvXfMd2u01— Bobby (@dirbobby) November 5, 2022