క్రికెట్ ప్రపంచంలోకి ఎందరో ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ కొందరే ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు. మరికొందరేమో అండర్ రేటెడ్ ఆటగాళ్లుగా మిగిలిపోతారు. అద్భుతమైన ఆట, నైపుణ్యం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్బాల్లో జట్టులో స్థానం కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇక టీమిండియా క్రికెట్ లో ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అందులో నమన్ ఓజా ఒకడు.. ”అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని” అన్నట్లు, ఓజా అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు. ఇక కర్ణుడి చావుకి సవాలక్షకారణాలు అన్నట్లు.. నమన్ ఓజా కెరీర్ నాశనం అవ్వడానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. ఒక సారి నమన్ ఓజా కెరీర్ ను క్షుణ్టంగా పరిశీలిస్తే..
నమన్ ఓజా.. చూడడానికి బక్కపలుచగా.. ఉన్నప్పటికీ సిక్స్ లు మాత్రం అలవోకగా కొట్టడంలో సిద్దహస్తుడు. వికెట్ కీపర్ గా క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఓజా.. తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ధోని, పార్థివ్ పటేల్, దినేశ్ కార్తీక్, ఉతప్ప, వృద్ధిమాన్ సాహా.. వీళ్లందరు వికెట్ కీపర్లుగా ఓజా జట్టులోకి వచ్చే నాటికే కొనసాగుతున్నారు. అప్పట్లో ధోని టీమిండియాకి రెగ్యూలర్ వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించేవాడు. దాంతో ఓజాకి అవకాశాలు రాలేదు. ఇక ధోని టెస్ట్ లకు వీడ్కోలు పలకడంతో.. టీమిండియా నుంచి ఓజాకి పిలుపొచ్చింది. దాంతో 2015లో శ్రీలంక తో టెస్ట్ మ్యాచ్ ద్వారా జాతీయ జట్టులోకి అరంగ్రేటరం చేశాడు. కానీ ఆ మ్యాచ్ లో బాగా రాణించలేక పోవడంతో అదే అతడికి చివరి టెస్ట్ మ్యాచ్ అయ్యింది. ఇక వన్డేల్లో సైతం శ్రీలంకపైనే అరంగ్రేటరం చేసిన ఓజా భారత్ తరపున 1 వన్డే మాత్రమే ఆడాడు. సెలక్టర్లు అతడికి కావాల్సినంత సమయాన్ని ఇవ్వలేదనే చెప్పాలి.
ఈ క్రమంలోనే ఒక బ్యాట్స్ మెన్ కు తగినంత సమయం ఇస్తేనే కదా అతడిలో ఉన్న టాలెంట్ బయటపడేది. అంతర్జాతీయ క్రికెట్ లో అంతగా రాణించని ఓజా ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్ ల్లో మాత్రం రికార్డు లు సృష్టించాడు. 2013-14 రంజీ సీజన్ లో మధ్యప్రదేశ్ తరపున 835 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. దాంతో అతడికి టీమిండియా నుంచి పిలుపు వస్తుందని అందరు భావించారు.. కానీ అతడి ఆశ నిరాశే అయ్యింది. దాంతో తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికి లెజెండ్స్ సిరీస్ లో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే తన చూడముచ్చటైన ఆటతో రాణిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో కేవలం 62 బంతుల్లో 90 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తాజాగా జరిగిన ఫైనల్లో కూడా 15 ఫోర్లు, 2 సిక్స్ లతో చెలరేగి 108 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో టీమిండియా లెజెండ్స్ జట్టు ట్రోఫీని ముద్దాడింది. ఓజా ఆటకు సచిన్ సైతం ఫిదా అయ్యి.. ప్రశంసల వర్షం కురిపించాడు.
గతంలో మహరాజా ట్రోఫీలో సైతం చెలరేగి 140 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇంతటి గొప్ప ఆట ఉన్నప్పటికీ అతడికి అవకాశాలు రాకపోవడానికి ప్రధాన కారణం టీమిండియాలో చాలా మంది వికెట్ కీపర్లు ఉండటమే అని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఓజా కెరీర్ విషయానికి వస్తే.. 146 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 22 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలతో 9753 పరుగులు చేశాడు. కీపర్ గా 415 క్యాచ్ లను అందుకున్నాడు. IPLల్లో కూడా కొన్ని టీమ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. 113 IPL మ్యాచ్ ల్లో1554 రన్స్ చేశాడు. ఇక టీ20ల్లో అతడి స్ట్రైక్ రేట్ 118 ఉండటం గమనార్హం. ఎంతటి ఆట, నైపుణ్యం ఉన్నప్పటికీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాప్పుడే కెరీర్ నిలబడుతుంది.
Great experience playing for road safety world series thanks @RSWorldSeries & beautifully organised by @pmgsportsin & television partner @colourscineplex for a wonderful tournament. #wear seat belts & helmet while driving vehicle pic.twitter.com/qHxkKwfl4a
— Naman Ojha (@namanojha35) March 25, 2021
What an Extraordinary Batting Technique!
Naman Ojha Hit the Fantabulous Century in The Finals of RSWS season 2, putting up an unbeaten score of 108 runs from 71 balls
It is an Adrenaline rush moment for all of us! #namanojha pic.twitter.com/gyzbAdyPu6— India Legends (@India__Legends) October 1, 2022