మన దేశంలో క్రికెట్ అంటే ఆట కాదు, అదో అంతులేని ఎమోషన్. పుట్టిన పిల్లాడి దగ్గరి నుంచి పెరిగి పెద్దయిన కుర్రాడి వరకు దాదాపు ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా క్రికెట్ ఆడతారు. అంతెందుకు ఇప్పుడంటే ఫోన్లకు పిల్లలు అత్కుకుపోతున్నారు గానీ ఒకప్పుడు సెలవొస్తే చాలు.. వీధిలోనో, గ్రౌండ్ లోనూ కుర్రాళ్లు, పిల్లలు క్రికెట్ ఆడుతూ కనిపించేవారు. దీనికి ఎవరూ కూడా అతీతం కాదు. ఇప్పుడు కూడా అలాంటి అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుర్గానవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ కూడా జరుగుతుంది. తాజాగా ఆదివారం, రెండో టీ20 జరగ్గా అందులో మన జట్టు అద్భుత విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ గౌహతిలో జరగ్గా, అభిమానులు భారీ సంఖ్యలో హాజర్యయారు. ఇక టీవీల్లోనూ చాలామంది చూశారు. ఇక మొబైల్లో చూసేవారు కూడా చాలామందే ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అటు తన జాబ్ చేస్తూ, ఇటు క్రికెట్ మ్యాచ్ చూస్తూ వావ్ అనిపించారు.
కానీ ఓ పూజారి మాత్రం అటు తన పనిచేస్తూనే, మరోవైపు క్రికెట్ పై ఉన్న తన ఇష్టాన్ని ఒకేసారి చూపించాడు. దుర్గాదేవి నవరాత్రులు సందర్భంగా పూజా చేస్తున్న సమయంలో రెండో టీ20 ప్రసారమవుతోంది. అలా అని పూజ ఆపేయలేదు. మ్యాచ్ చూడటం కూడా మానేయలేదు. రెండింటిని ఒకేసారి చేస్తూ మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలీదు గానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో వైరల్ గా మారింది. మరి ఈ పూజారి మల్టీ టాలెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.