ఇప్పటికే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను నెగ్గిన టీమిండియా మంచి జోరు మీదుంది. ఇక బుధవారం(సెప్టెంబర్ 28) నుంచి సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌కు సిద్ధమైంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌కు ముందు రెండు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకం. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిస్తే.. వరల్డ్ కప్‌లో సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగొచ్చని ఇరు జట్లు భావిస్తున్నాయి. కాగా.. టీమిండియాతో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
బావుమా మాట్లాడుతూ.. ‘టీమిండియాలో మేటి జట్టుతో పోటీపడటం సవాలే. కానీ.. మేము కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. టీమిండియా నుంచి మాకు జస్ప్రీత్ బుమ్రా నుంచే ఎక్కువగా ముప్పు ఉంది. ఎందుకంటే మా దేశంలో పిచ్‌లకు ఇండియాలో పిచ్‌లకు కొంత తేడా ఉంటుంది. మేము అక్కడి పిచ్‌లకు అలవాటు పడి ఇక్కడి పరిస్థితిలకు తగ్గట్లు ఆడాలంటే సవాళ్లతో కూడుకున్న విషయం. కొత్త బంతికి ఇక్కడ అద్భుతంగా స్వింగ్ అవుతుంది. బుమ్రా కొత్త బంతితో డేంజర్‌గా మారతాడు. స్వింగ్‌ను ఎదుర్కొనేందుకు మేము కొంత ఇబ్బంది పడుతుంటాం.. అందుకే బుమ్రా బౌలింగ్‌లో కొంత జాగ్రత్త పడతాం. బుమ్రాతోనే మాకు ప్రధానంగా ముప్పు ఉందని నేను భావిస్తున్న’ అని బావుమా అన్నాడు.
అలాగే టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉండటంతో ఆ జట్టులో నూతన ఉత్సహం వచ్చిందని బావుమా అభిప్రాయపడ్డాడు. కోహ్లీ, రోహిత్ లాంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్న టీమ్‌తో పోటీ పడటం మాకేంతో మేలు చేస్తుందని అన్నాడు. కాగా.. కొంతకాలం సరైన ఫామ్‌లో లేని కోహ్లీ ఆసియా కప్‌తో ఫామ్‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారీ షాట్లు ఆడి టచ్‌లోకి వచ్చాడు. కాగా.. గతేడాది భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన 5 టీ20ల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. బెంగుళూరులో జరగాల్సిన సిరీస్ డిసైడింగ్ మ్యాచ వర్షం కారణంగా రద్దు అవ్వడంతో సిరీస్ టైగా ముగిసింది. మరి ఈ మూడు టీ20ల సిరీస్‌లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
“I expect a good, strong and competitive series.” 💬
Captain Temba Bavuma is confident ahead of South Africa’s T20I series against India ⬇️https://t.co/aBiAH6w8rM
— ICC (@ICC) September 28, 2022
ఇది కూడా చదవండి: సిక్సుల వర్షం కురిపించిన ‘హల్క్’ రహ్కీమ్! 54 బంతుల్లోనే..