పుట్టింది విజయవాడ.. పెరిగింది హైదరాబాద్.. రూలింగ్ నెదర్లాండ్స్! ఈ మధ్య వచ్చిన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో డైలాగ్‌కు కాపీలా ఉన్నా.. ఇది రియల్. విజయవాడలో పుట్టిన కుర్రాడు ఇప్పుడు నెదర్లాండ్స్ నేషనల్ క్రికెట్ టీమ్‌లో స్టార్‌గా మారిపోయాడు.
నిడమనూరు తేజ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతున్న పేరు. ఓటమి అంచున చిక్కుకున్న నెదర్లాండ్స్‌ను అద్భుతమైన సెంచరీ చేసి ఒంటి చేత్తో గెలిపించిన సెన్సేషన్. పేరు చూస్తే.. తెలుగు వాడిలా ఉంది, నెదర్లాండ్స్‌ను గెలిపించడం ఏంటి? అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. అతను నెదర్లాండ్స్ జాతీయ క్రికెటర్. ఈ నెల 21న జింబాబ్వే-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి నెదర్లాండ్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తేజ అద్భుతం చేశాడు. ఏకంగా సెంచరీతో చెలరేగి నెదర్లాండ్స్‌కు అద్భుత విజయం అందించాడు.
దీంతో.. తేజ పేరు నెదర్లాండ్స్‌లోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనూ మారుమోగిపోతుంది. ఎందుకంటే అతను పక్కా తెలుగు.. విజయవాడలో పుట్టి, హైదరాబాద్‌లో చదివిన 24 క్యారెట్ల తెలుగు కుర్రాడు. మరి విజయవాడలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన ఈ కుర్రాడు నెదర్లాండ్స్ టీమ్‌కు ఎందుకు ఆడుతున్నాడు? ఇండియాలో అవకాశాలు రాలేదా? అసలు అతని ప్రయాణం.. ‘విజయవాడ టూ నెదర్లాండ్స్ నేషనల్ క్రికెట్ టీమ్’ వరకు ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
1994 ఆగస్ట్ 22న విజయవాడలో పుట్టిన తేజ.. చదువులకు కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడే ఉన్నత చదువులు అభ్యసించి, విదేశాల్లో భారీ జీతం వచ్చే ఉన్నత ఉద్యోగం సైతం సంపాదించాడు. చిన్నతనం నుంచి క్రికెట్‌పై ఇష్టమున్నా.. చదువులోనూ మెరుగ్గా ఉండటం, విదేశీ ఉద్యోగం వెతుక్కుంటూ రావడంతో, తేజ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా స్థిరపడ్డాడు. కానీ, మనసులో ఎక్కడో క్రికెటర్ అవ్వాలనే తపన అతన్ని అనునిత్యం వెంటాడుతూనే ఉంది. మంచి ఉద్యోగం ఉన్నా, లక్షల్లో జీతం వస్తున్నా.. ఆత్మ సంతృప్తిని ఇవ్వడం లేదు. తనని తాను ఓ గొప్ప క్రికెటర్‌గా చూసుకోవాలనే కల అతన్ని వెంటాడింది. ఇలాగే ఉద్యోగం చేసుకుంటూ పోతే.. జీవితంలో ఇంకేం సాధించలేమని అనుకున్న తేజ.. 2017-18 మధ్య ఆక్లాండ్ తరఫున క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఆక్లాండ్ సూపర్ స్మాష్ లీగ్‌లోనూ అరంగేట్రం చేశాడు. 2019లో నెదర్లాండ్స్‌కు షిఫ్ట్ అయిన తేజ.. ప్లేయర్ కమ్ క్రికెట్ కోచ్‌గా మారిపోయాడు.
2021లో ఓ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో తేజ వెలుగులోని వచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేయడంతో తేజకు నెదర్లాండ్స్ జాతీయ జట్టులో చోటు దక్కింది. 2022 మే 31న వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఎంట్రీ మ్యాచ్‌తోనే తేజ సత్తా చాటాడు. 51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి అదరగొట్టాడు. ఆ వెంటనే టీ20 జట్టులోనూ తేజకు చోటు లభించింది. అక్కడి నుంచి తేజ నెదర్లాండ్స్ జట్టులో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు. తాజాగా మంగళవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో స్టార్ ప్లేయర్ అయిపోయాడు.
ఇప్పటి వరకు నెదర్లాండ్స్ తరఫున 9 వన్డేలు ఆడిన తేజ 251 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అలాగే 6 టీ20లు ఆడిన తేజ 30 పరుగులు మాత్రమే చేశాడు. టీ20ల్లో ఇప్పటి వరకు సరైన ప్రదర్శన చేయలేదు. ఇక న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ జట్టు తరఫున 10 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడిన తేజ 265 పరుగులు చేశాడు. అందులోనూ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విజయవాడలో పుట్టి, చిన్నతనం నుంచి క్రికెట్‌లో ట్రైనింగ్ తీసుకోకపోయినా.. ఆటపై ఇష్టంతో ఉద్యోగం చేస్తూనే క్రికెట్‌ను నేర్చుకుని ఇప్పుడు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే స్థాయికి చేరుకోవడం నిజంగా తెలుగువారందరికీ గర్వకారణం అని చెప్పవచ్చు. మరి తేజ జర్నీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Time to chase 🏏🏏🏏
🇳🇱 Netherlands post 240/7 (45) in a rain affected innings.
Debutant Teja Nidamanuru top-scores with an unbeaten 58, Singh 47; Hosein 2-29, Mayers 2-50.
🌴West Indies need 241 to win.
📸 @ICC, @windiescricket#WIPlayers #Cricket #WestIndies #WI #NEDvWI pic.twitter.com/bIgiUcsKk2
— WIPA (@wiplayers) May 31, 2022
Teja Nidamanuru, the hero of Netherlands.
One of the crazy knocks in recent times, Netherlands was out of the game with 64/5 while chasing 250 & then the classic show started with a brilliant hundred by Teja 110*(96) to seal the game. pic.twitter.com/zdDlFAocfc
— Johns. (@CricCrazyJohns) March 21, 2023