టీవీల్లో క్రికెట్ లైవ్ చూడాలంటే నెలకింత అని బిల్ కడితే సరిపోదు. క్రికెట్ ఏ ఛానల్‌లో వస్తుందో ఆ ఛానల్‌ను ప్రత్యేకంగా కొనాలి. లేదా ఆ ఛానల్ ఉన్న ప్యాక్‌ను రీచార్జ్ చేసుకోవాలి. ఒక్కొ సిరీస్ ఒక్కొ ఛానల్ లైవ్ టెలికాస్ట్‌చేసే రైట్స్ తీసుకుంటుండంతో.. క్రికెట్ అభిమానులు ఆ ఛానల్ కోసం ప్రత్యేకంగా రీచార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. గతంలో అయితే.. దూరదర్శన్‌లో టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ లైవ్ వచ్చేది. అప్పుడు ఇలాంటి ఇబ్బంది లేదు. తాజాగా క్రికెట్ అభిమానులకు శుభవార్త చెబుతూ.. డీడీ స్పోర్ట్స్ (దూరదర్శన్ స్పోర్ట్స్)లో టీమిండియా ఆడే అన్ని టెస్టు మ్యాచ్‌లు లైవ్ ఇవ్వనుంది.
దీంతో ఎలాంటి రీచార్జ్ లేకుండానే క్రికెట్ అభిమానులు ప్రత్యక్షప్రసారాన్ని ఆస్వాదించవచ్చు. టీమిండియా ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికాతో, వెస్టిండీస్‌తో సిరీస్‌లు ఆడనుంది. కొన్ని ఏళ్ల క్రితం టెస్టు మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడాన్ని దూరదర్శన్ నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ ఆ సేవలను ప్రారంభించడంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డీడీ స్పోర్ట్స్ ఫ్రీ ఛానల్ కనుక ఎలాంటి రీచార్జ్ లేకుండానే లైవ్ మ్యాచ్‌లు చూడొచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: IPL ప్రదర్శనతో కోహ్లీ సామర్థ్యాన్ని డిసైడ్ చేయడం అంటే అవమానించడమేనా?
DD sports come back 🔥🔥🙏🙏 pic.twitter.com/NPMumzCRs6
— Debashis Metya (@Debashis159) May 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.