‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్’లో భారత్ ఆరంభం నుంచి తడబడుతూనే ఉంది. వార్మప్ మ్యాచ్‌లు మినహా మిగిలిన రెండు మ్యాచ్‌లు ఘోర పరాభవాలే ఎదురయ్యాయి. పాకిస్తాన్ మ్యాచ్‌లో ఫలితమే మళ్లీ రిపీట్ అయ్యింది. న్యూజిలాండ్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో పూర్తిగా విఫలమైన పరిస్థితి కనిపించింది. టోర్నమెంట్‌కి ముందు వేసిన అంచనాలు అన్నీ తారుమారు అయ్యాయి. చెప్పిన మాట, వేసిన వ్యూహం ఏదీ కలిసి రాలేదు. 20 ఓవర్లలో 110 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయారు. ఆ స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 8 వికెట్ల తేడాతో 5.3 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. టోర్నమెంట్‌లో మన స్థానాన్ని ప్రశ్నార్థకంలో పడేసింది. ఇప్పటికైనా సెమీస్ చేరే అవకాశం టీమిండియాకు ఉందా అని అందరి ప్రశ్న. అవకాశం అయితే లేకపోలేదు.. కానీ, అందుకు మహా అద్భుతాలే జరగాలి.
అలా జరిగితేనే సెమీస్‌కు..
భారత్‌కు సెమీస్ అవకాశాలు సంక్లిష్టమే అయినా.. అవకాశం అయితే లేకపోలేదు. అలా జరగాలి అంటే తర్వాతి మ్యాచ్‌లలో టీమిండియా ప్రతి మ్యాచ్ భారీ ఆధిక్యంతో గెలవాలి. అప్పుడు పాయింట్ల పట్టికలో మనకు 6 పాయింట్లు వస్తాయి. మరోవైపు న్యూజిలాండ్‌పై ఆఫ్గనిస్థాన్ గెలవాలి. అప్పుడు టీమిండియా, ఆఫ్గనిస్థాన్, న్యూజిలాండ్ జట్లకు తలా 3 పాయింట్లు వస్తాయి. వాటిలో టీమిండియా అత్యధిక రన్ రేట్ సాధించగలిగితే సెమీస్ చేరేందుకు అవకాశం ఉంటుంది. అలా జరగడం దాదాపు అసాధ్యమే అయినా.. ఆ అద్భుతం జరుగుతుందేమే వేచి చూడాలి. టీమిండియా ప్రదర్శనపై ఐపీఎల్ ప్రభావం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.