ఆసియాకప్ లో టీమిండియా ప్రదర్శన అందరికీ పెద్ద షాక్. లేకపోతే ఏంటి.. ఫైనల్ కి వెళ్లడం, టైటిల్ గెలవడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. కానీ రియాలిటీ జరిగిందే వేరే. లీగ్ దశలో బాగానే ఆడిన మన జట్టు.. సూఫర్ 4 దశకు వచ్చేసరికి తేలిపోయింది. గాలి బుడగలా పేలిపోయింది. పాకిస్థాన్ తో మ్యాచులో 5 వికెట్ల తేడాతో, శ్రీలంకతో మ్యాచులో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ కోసం సంజూ శాంసన్ పేరు వినిపిస్తోంది. ఎందుకు ఈ క్రికెటర్ చర్చనీయాంశమయ్యాడు?
ఇక వివరాల్లోకి వెళ్తే.. అక్టోబరులో టీ20 ప్రపంచకప్ ఉంది. చెప్పాలంటే సరిగ్గా నెల కూడా లేదు. ఇలాంటి టైమ్ లో ఆసియాకప్ లో టీమిండియా ఓడిపోవడం, ఆ ఓటములు కూడా పాక్, లంక చేతిలో కావడం బీసీసీఐని ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. ఇదే జట్టుతో వెళ్తే.. ప్రపంచకప్ లో గెలవడం కష్టమైపోతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జట్టులో మార్పులు చేర్పులు చేయాలని బోర్డు అనుకుంటోందట. దీంతో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా సంజూ శాంసన్ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
దానికి తోడు ఆసియాకప్ లో పంత్ పేలవ ప్రదర్శన గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పంత్-సంజూ గణాంకాలతో పోస్టులు పెడుతున్నారు ఇక వన్డే, టెస్టుల్లో అదరగొడుతున్న పంత్.. టీ20ల్లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. ఇప్పటివరకు 57 టీ20ల్లో126.24 స్ట్రైక్ రేటుతో 914 పరుగులు చేశాడు. అదే టైమ్ లో సంజూ 16 టీ20ల్లో 135.15 స్ట్రైక్ రేటుతో 296 పరుగులు చేశాడు. పంత్ కి దక్కినన్నీ అవకాశాలు సంజూకి దక్కలేదు. ఒకవేళ టీ20 ప్రపంచకప్ లో సంజూ శాంసన్ చోటు దక్కించుకుంటే మాత్రం ప్రూవ్ చేసుకోవడానికి మరో ఛాన్స్ వచ్చినట్లే. టీ20 ప్రపంచకప్ లో సంజూ శాంసన్ కి ఛాన్స్ ఇవ్వనున్నారనే న్యూస్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ప్రయోగశాలగా టీమిండియా! మొదటికే మోసం వస్తుందా..?
🚨|🗒️Sanju Samson will be part Of T20 World Cup Squad & for the remaining series (AUS & SA).#BCCI #IndianCricketTeam #SanjuSamson
— Joel (@Crickfootboi11) September 8, 2022
Sanju Samson is a better choice in white ball cricket. Rishabh pant has played Worldcup 2019, T20 WC 2021, Asia Cup 2022, But he didn’t do anything for India. @BCCI @bhogleharsha @SGanguly99 #SanjuSamson #T20WorldCup2022 @ImRo45 pic.twitter.com/CCILgapUVt
— DIJIN.U.M (@UmDijin) September 7, 2022
#sanjusamson almost confirmed for the world Cup t20 pic.twitter.com/NHjWtSCVUz
— Sanju Meena official (@SanjuMe51801547) September 8, 2022