IND vs PAK, Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు.. భారత క్రికెట్‌కు అంత కంటే ఎక్కువ. 2011లో పాక్‌తో సెమీ ఫైనల్‌కు ముందు సచిన్ చేసిన పనితోనే ఇండియాకు వరల్డ్ కప్ వచ్చింది. అదేంటంటే..
ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఇదో క్రికెట్ మ్యాచ్ అనేకంటే.. ఇరు దేశాల మధ్య మినీ యుద్ధంగా చెప్పవచ్చు. భారత్-పాక్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కళ్లప్పగించేస్తారు. క్రికెట్ ఫ్యాన్స్‌లో ఈ మ్యాచ్‌పై ఎంత ఆసక్తి ఉంటుందో.. అంతుకు వంద రెట్లు ఇరు దేశాల ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో గెలిస్తే.. నెత్తిన పెట్టుకునే క్రికెట్ అభిమానులు.. ఓడితే అదే స్థాయిలో ద్వేషిస్తారు. గొప్ప గొప్ప క్రికెటర్లకు కూడా భారత్-పాక్ మ్యాచ్ వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి.
అందుకే ఇటు భారత క్రికెటర్లు అయినా, అటు పాకిస్థాన్ క్రికెటర్లు అయినా.. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇరు దేశాల జట్లు ప్రాణం పెట్టి ఆడతారు. ఈ విషయానికి చక్కటి ఉదాహరణ గురించి చెప్పుకుంటే.. 2011లో టీమిండియా ఆటగాళ్లు చూపించిన పోరాట పటిమ బెస్ట్ ఎక్సాంపుల్‌గా నిలుస్తోంది. 2011 వన్డే వరల్డ్ సందర్భంగా భారత్.. పాక్‌తో పంజాబ్‌లోని మొహాలీ వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్లకు మధ్యాహ్న భోజనం అందలేదు.
దీంతో ఖాళీ కడుపులతోనే భారత ఆటగాళ్లు బరిలోకి దిగారు. అయితే.. అన్నం లేక అలసిపోయి అల్లాడిపోతున్న టీమిండియా ఆటగాళ్లను క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన మాటలతో వారిలో ఆకలిని చంపేసి.. పాక్‌పై గెలవాలనే కసిని నూరిపోశాడు. ఆ రోజు సచిన్ కనుక తన మాటలతో భారత ఆటగాళ్లలో స్ఫూర్తి నింపకపోయి ఉంటే.. సెమీస్‌లో భారత్ గెలవడం కష్టమనే విషయం చాలా మందికి తెలియదు. కడుపులో తిండి లేకపోయినా.. పాక్‌పై ఓడిపోవద్దనే ఒకే ఒక లక్ష్యంతోటి ఆ రోజు టీమిండియా ప్రాణం పెట్టి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో పాక్‌ను 29 పరుగుల తేడాతో పాక్‌ను భారత్ ఓడించి, ఆ తర్వాత ఫైనల్లో శ్రీలంకను సైతం ఓడించి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sachin Tendulkar recalls the 2011 World Cup match incident.. pic.twitter.com/emh4QShXOt
— RVCJ Media (@RVCJ_FB) April 29, 2023