టీ20 వరల్డ్ కప్ 2022 మహా సంగ్రామంలో భాగంగా.. టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ మ్యాచ్ లు ప్రారంభించింది. అందులో భాగంగానే మూడు మ్యాచ్ లను వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టుతో ఆడుతోంది. ఇక మెుదటి మ్యాచ్ లో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ లో ఇదే జోరు కొనసాగిస్తుందనుకున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ చూసిన అభిమానులు అసలు టీమిండియా ఆడుతుంది టీ20 నా.. లేక టెస్ట్ మ్యాచా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అర్దశతకంతో మెరిసినప్పటికీ.. టీమిండియా ఓటమికి కారణం అయ్యాడు.
కేఎల్ రాహుల్.. గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడిప్పుడే తన ఫామ్ లోకి వస్తున్నాడు. పవర్ ప్లే లో ఎక్కువ బంతులు ఎదుర్కొని తక్కువ పరుగులు చేస్తున్నాడన్న అపవాదు అతడిపై ఉంది. తాజాగా మరోసారి దానిని రుజువు చేసి.. టీమిండియా పరాజయానికి కారణం అయ్యాడు. తాజాగా వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 43 బంతుల్లో 50 పరుగులు చేసిన రాహుల్.. ఆ తర్వాత అవుట్ అయ్యే సరికి 55 బంతులు ఎదుర్కొని 74 రన్స్ చేశాడు. బాగానే కొట్టాడుగా మరెందుకు అతడిని విమర్శిస్తున్నారన్న అనుమానం మీకు రావొచ్చు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం రన్ రేట్. ముందుగా బ్యాటింగ్ చేసిన బ్యాటర్ ఎక్కువ బంతులు ఆడి తక్కువ పరుగులు చేస్తే.. తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్ పై రన్ రేట్ ఒత్తిడి గ్యారంటీగా పడుతుంది. దాంతో వారు వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో వికెట్లు పారేసుకుంటారు. ప్రస్తుతం ఈ మ్యాచ్ లో కూడా అదే జరిగింది.
ఈ క్రమంలోనే రాహుల్ లాంటి బ్యాటర్ 50 పరుగులకు 43 బంతులు తీసుకున్నాడంటే.. ఏమనుకోవాలి? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా బ్యాటింగ్ చేస్తే.. వరల్డ్ కప్ ఎలా గెలుస్తారంటూ.. ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రాహుల్ స్లో బ్యాటింగే టీమిండియా ను ప్రపంచ కప్ లో కూడా కొంప ముంచేలా ఉందంటూ.. అభిప్రాయపడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెుదట బ్యాటింగ్ చేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్132 పరుగులకే పరిమితం అయ్యి 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీమిండియా లక్ష్య ఛేదనలో ఏ దశలోనూ ముందుకెళ్లలేదు. వెస్టర్న్ ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించడంతో బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. మరీ ఇంత చెత్త బ్యాటింగ్ తో వరల్డ్ కప్ ఎలా గెలుస్తారు అంటూ.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
FIFTY for @klrahul off 43 deliveries.#TeamIndia 101/4 in 14.3 overs.
— BCCI (@BCCI) October 13, 2022
That’s that from the practice match against Western Australia.
They win by 36 runs.
KL Rahul 74 (55) pic.twitter.com/5bunUUqZiH
— BCCI (@BCCI) October 13, 2022