విదేశాల్లో అదరగొడుతున్న టీమిండియా ఇప్పుడు స్వదేశంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. వచ్చే సెప్టెంబర్ లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా భారత్ పర్యటనకు రానున్నాయి. అందుకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా సెప్టెంబర్ నెలలో వరుసగా ఆస్ట్రేలియాతో 3 టీ20లు, సెప్టెంబర్- అక్టోబర్ నెలలో సౌత్ ఆఫ్రికాతో 3టీ20లు, 3 వన్డే మ్యాచుల్లో తలపడనుంది.
ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇండియా- 2022:
Take a look at #TeamIndia‘s home series fixture against Australia. 👍#INDvAUS pic.twitter.com/zwNuDtF32R
— BCCI (@BCCI) August 3, 2022
సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా-2022:
అక్టోబర్ 11- మూడో వన్డే(ఢిల్లీ)
Check out the #INDvSA home series schedule. 👌#TeamIndia | @BCCI | @OfficialCSA pic.twitter.com/jo8zC4hjDq
— BCCI (@BCCI) August 3, 2022
చాలాకాలం తర్వాత హైదరాబాద్ వేదికగా టీ20 జరగనుంది. సెప్టెంబర్ 25న ఆస్ట్రేలియా- టీమిండియా టీ20 మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది. అక్టోబర్ లో జరగబోయే ఐసీసీ మెన్ టీ20 ప్రపంచకప్ నేపథ్యంలోనే అన్ని దేశాలు తీరిక లేకుండా క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. టీమిండియా బిజీ షెడ్యూల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.